twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రిష్ చెప్పేశారు: బయోపిక్‌లో బాలయ్యగా ఫ్యామిలీ మెంబరే, మోక్షజ్ఞతో ఆదిత్య 369 రీమేక్

    |

    తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్' రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ తొలి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా దర్శకుడు క్రిష్, బాలయ్యతో కలిసి రానా హోస్ట్ చేస్తున్న నెం.1 యారి కార్యక్రమానికి హాజరయ్యారు.

    ఈ సందర్భంగా బాలయ్య, క్రిష్ నుంచి రానా పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. అంతే కాదు ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్రలో కనిపించేది ఎవరనే విషయం కూడా వెల్లడైంది.

    బాలయ్య పాత్రలో ఆర్యవీర్

    బాలయ్య పాత్రలో ఆర్యవీర్

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాలయ్య పాత్రలో ఆర్యవీర్ కనిపించబోతున్నారు. ఆర్యవీర్ మరెవరో కాదు... బాలకృష్ణ కూతురు తేజస్వి-భరత్ దంపతులు కుమారుడు. ఇందులో బాలకృష్ణ చిన్ననాటి పాత్రలో ఆర్యవీర్ నటించాడు.

    బాలయ్య కంటే బెస్ట్ యాక్టర్ అతడే

    బాలయ్య కంటే బెస్ట్ యాక్టర్ అతడే

    తాను ఇప్పటి వరకు పని చేసిన యాక్టర్లలో బెస్ట్ యాక్టర్ ఆర్యవీర్ మాత్రమే అని క్రిష్ చెప్పుకొచ్చారు. వయసు 7 నెలలే అయినా అద్భుతమైన హావభావాలు పలికించాడు.... బాలయ్య కంటే, రానా కంటే ఆర్యవీర్ నా దృష్టిలో బెస్ట్ యాక్టర్ అని తెలిపారు. ‘ఎన్టీఆర్ బయోపిక్'లో బాలకృష్ణకు నామకరం చేసే సీన్లో ఆర్యవీర్ కనిపించబోతున్నారట.

    సెక్సీ అనే పదం ఎక్కువగా

    సెక్సీ అనే పదం ఎక్కువగా

    దర్శకుడు క్రిష్ సెట్లో ఎక్కువగా ఏ పదం ఉపయోగిస్తారు? అనే ప్రశ్నకు బాలయ్య స్పందిస్తూ.... ‘సెక్సీ' అనే వర్డ్ ఎక్కువగా వాడతారు అని తెలిపారు

    మోక్షజ్ఞతో ఆదిత్య 369

    మోక్షజ్ఞతో ఆదిత్య 369

    రజనీకాంత్ బయోపిక్ తీస్తే ‘కండక్టర్' అనే టైటిల్, బాలకృష్ణ బయోపిక్ తీస్తే ‘బాలయ్య' టైటిల్ పెడతాను.... ‘ఆదిత్య 369' సినిమా రీమక్ చేయాల్సి వస్తే మోక్షజ్ఞతో, ‘సమర సింహారెడ్డి' రీమేక్ చేయాల్సి వస్తే మళ్లీ బాలయ్యతోనే చేస్తాను. ‘బైరవ ద్వీపం' రీమేక్ అయితే తారక్‌తో, రౌడీ ఇన్‌స్పెక్టర్ కళ్యాణ్ రామ్‌తో చేస్తానని క్రిష్ తెలిపారు.

    English summary
    Latest episode of Rana’s No. 1 Yaari, Krish opened up about directing Mokshagna. When Rana asked Krish to choose one Balayya film is he would ever remake with Mokshagna, Aditya 369 was Krish’s choice. Aditya 369 is an iconic 1991 sci-fi fantasy thriller, directed by Singeetam Srinivasa Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X