Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
క్రిష్ చెప్పేశారు: బయోపిక్‌లో బాలయ్యగా ఫ్యామిలీ మెంబరే, మోక్షజ్ఞతో ఆదిత్య 369 రీమేక్
తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్' రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ తొలి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా దర్శకుడు క్రిష్, బాలయ్యతో కలిసి రానా హోస్ట్ చేస్తున్న నెం.1 యారి కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలయ్య, క్రిష్ నుంచి రానా పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. అంతే కాదు ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్రలో కనిపించేది ఎవరనే విషయం కూడా వెల్లడైంది.
బాలయ్య పాత్రలో ఆర్యవీర్
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాలయ్య పాత్రలో ఆర్యవీర్ కనిపించబోతున్నారు. ఆర్యవీర్ మరెవరో కాదు... బాలకృష్ణ కూతురు తేజస్వి-భరత్ దంపతులు కుమారుడు. ఇందులో బాలకృష్ణ చిన్ననాటి పాత్రలో ఆర్యవీర్ నటించాడు.
బాలయ్య కంటే బెస్ట్ యాక్టర్ అతడే
తాను ఇప్పటి వరకు పని చేసిన యాక్టర్లలో బెస్ట్ యాక్టర్ ఆర్యవీర్ మాత్రమే అని క్రిష్ చెప్పుకొచ్చారు. వయసు 7 నెలలే అయినా అద్భుతమైన హావభావాలు పలికించాడు.... బాలయ్య కంటే, రానా కంటే ఆర్యవీర్ నా దృష్టిలో బెస్ట్ యాక్టర్ అని తెలిపారు. ‘ఎన్టీఆర్ బయోపిక్'లో బాలకృష్ణకు నామకరం చేసే సీన్లో ఆర్యవీర్ కనిపించబోతున్నారట.
సెక్సీ అనే పదం ఎక్కువగా
దర్శకుడు క్రిష్ సెట్లో ఎక్కువగా ఏ పదం ఉపయోగిస్తారు? అనే ప్రశ్నకు బాలయ్య స్పందిస్తూ.... ‘సెక్సీ' అనే వర్డ్ ఎక్కువగా వాడతారు అని తెలిపారు
మోక్షజ్ఞతో ఆదిత్య 369
రజనీకాంత్ బయోపిక్ తీస్తే ‘కండక్టర్' అనే టైటిల్, బాలకృష్ణ బయోపిక్ తీస్తే ‘బాలయ్య' టైటిల్ పెడతాను.... ‘ఆదిత్య 369' సినిమా రీమక్ చేయాల్సి వస్తే మోక్షజ్ఞతో, ‘సమర సింహారెడ్డి' రీమేక్ చేయాల్సి వస్తే మళ్లీ బాలయ్యతోనే చేస్తాను. ‘బైరవ ద్వీపం' రీమేక్ అయితే తారక్‌తో, రౌడీ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ రామ్‌తో చేస్తానని క్రిష్ తెలిపారు.