రకుల్ ప్రీత్ కోసం.. పవన్ సినిమాను పక్కన పెట్టా.. చాలా డిస్ట్రబ్ అయ్యా.. క్రిష్ సంచలన విషయాలు
గౌతమి పుత్ర శాతకర్ణి, కంచె లాంటి పిరియాడిక్ చిత్రాలతో ప్రేక్షకులు ఆకట్టుకొన్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్, వైష్ణవ్ తేజ్‌తో ఓ గ్రామీణ నేపథ్య ఉన్న సినిమాను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత అక్కినేని హోస్ట్‌గా నిర్వహిస్తున్న సామ్ జామ్ షోలో పాల్గొన్న రకుల్, క్రిష్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ..

కొండపొలం బుక్ ఆధారంగా
రకుల్ ప్రీత్ సింగ్‌తో తీస్తున్న చిత్రం వెనుక పెద్ద కథ ఉంది. పవన్ కల్యాణ్ గారితో తీస్తున్న సినిమా కోసం పనిచేస్తున్నాను. ఆ సమయంలో ఓ రోజు రాత్రి కొండ పొలం అనే పుస్తకం చదివాను. ఆ రోజంతా నిద్రపట్టలేదు. వెంటనే నా పార్ట్‌నర్ రాజీవ్ రెడ్డికి కాల్ చేశాను. తప్పుకుండా సినిమాగా చేయాలని అనుకొన్నాను అని క్రిష్ తెలిపారు.

ఏ హీరో ఒప్పుకోరు.. పవన్ అనుమతితోనే
సాధారణంగా తనతో చేసే సినిమాను పక్కన పెట్టి మరో సినిమా చేస్తానంటే ఓ హీరో ఒప్పుకోరు. కానీ పవన్ కల్యాణ్ ఒప్పుకొన్నారు. ఆయన అనుమతి తీసుకొని సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. వెంటనే రకుల్, వైష్ణవ్ తేజ్‌కు కాల్ చేశాను. వారిని కలిసి కథ చెప్పడం, వెంటనే వాళ్లు అంగీకరించడంతో ఈ సినిమా పట్టాలెక్కింది అని క్రిష్ చెప్పారు.

45 కంప్లీట్ చేస్తానని మాటిచ్చా
కరోనావైరస్ లాక్‌డౌన్ కావడంతో అందరూ షూటింగులు చేయకుండా ఉన్నారు. ఆ సమయంలోనే కొండపొలం కథను తెరకెక్కించాలని అనుకొన్నాను. పవన్ కల్యాణ్‌ను ఒప్పించి 45 రోజుల్లో సినిమా కంప్లీట్ చేస్తానని చెప్పాను. పవన్ కల్యాణ్ ఓకే అనడంతో రకుల్‌కు కథ చెప్పాను. గ్రామీణ యువతిగా పూర్తిగా డీ గ్రామరైజ్డ్ కారెక్టర్‌ను రకుల్ తొలిసారి చేస్తున్నారు అని క్రిష్ తెలిపారు.

రకుల్ డిసిప్లేన్‌డ్ యాక్టర్
నా కెరీర్‌లో ఎంతో మంది ఆర్టిస్టులు, హీరోయిన్లతో పనిచేశాను. అందులో రకుల్ ప్రీత్ సింగ్ చాలా డిసిప్లేన్ ఉన్న హీరోయిన్. ప్రొఫెషన్ పట్ల డెడికేషన్ ఉన్న యాక్టర్. సెట్లో ఆమెతో పనిచేసిన సందర్భంగా ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆకట్టుకొన్నాయి. అమేజింగ్ పర్సనాలిటీ అంటూ దర్శకుడు క్రిష్ ప్రశంసలతో ముంచెత్తారు.

టైమ్, పంక్చువాలిటీలో బాలకృష్ణ
సెట్లోకి రావడంలో టైమ్, పంక్చువాలిటీ నన్ను చాలా ఆకట్టుకొన్నాయి. గతంలో నేను బాలకృష్టతో పనిచేశాను. ఉదయం 6 గంటలకు షూటింగ్ అంటే కరెక్ట్‌గా ఆరు గంటలకు ఆయన సెట్లో ఉంటారు. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్‌ను చూశాను. రకుల్ కూడా టైమ్‌కు రావడం చూసి షాక్ అయ్యాను. ఇన్స్‌పైరింగ్ యాక్టర్ అని క్రిష్ పేర్కొన్నారు.

ఓబులమ్మగా రకుల్ ప్రీత్ సింగ్
కొండ పొలం పుస్తకంగా ఆధారంగా గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రాన్ని రూపొందిస్తున్నాను. అందులో రకుల్ ఓబులమ్మ అనే క్యారెక్టర్‌ను ప్లే చేస్తున్నారు. ఆ పాత్రను అర్ధం చేసుకొని అందులోకి పరకాయ ప్రవేశం చేశారా అనే సందేహం కలిగింది. రకుల్ కెరీర్‌లో మంచి చిత్రంగా మిగులుతుంది అని క్రిష్ చెప్పారు.


Click it and Unblock the Notifications











