గుర్తుపట్టలేం: దర్శకుడు క్రిష్ ఇంతగా మారిపోయాడు

టాలీవుడ్ లో ప్రెస్టీజియస్ గా రూపొందుతోన్న సావిత్రి బయోపిక్ లో.. మాయాబజార్ దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో మెరవనున్నాడు క్రిష్. ఆ కేవీ రెడ్డి పాత్రలో ఒదిగిపోయేందుకు గాను.. అచ్చు అలాగే ఉండేలా తన గెటప్ ను మ

Recommended Video

Filmibeat Top 10 ఫిల్మీ బీట్ టాప్ 10

ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ప్రేక్షకులను అలరించబోతోంది. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన సావిత్రి సినిమా రంగంలో మహానటిగా ఎదిగిన పరిణామాలతో పాటు, ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను సైతం చూపించనున్నారు. ఈ వివరాలన్నీ మనకు తెలిసినవే.

 సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో

సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో

సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ క‌నిపించ‌నున్నాడు.. స‌మంత‌, షాలిని పాండే, మోహ‌న్ బాబు కీల‌క‌పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.. నాగ్ అశ్విన్ ఈ మూవీ ద‌ర్శ‌కుడు. ఈ మూవీలో మాయా బ‌జార్ లోని కొన్ని సీన్స్ ను చిత్రీక‌రించ‌నున్నారు.. ఆప్ప‌ట్లో ఆ మూవీకి కె వి రెడ్డి ద‌ర్శ‌కుడిగా, సింగీతం శ్రీ‌నివాస‌రావు స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశారు..

 కె వి రెడ్డి పాత్ర కోసం

కె వి రెడ్డి పాత్ర కోసం

ఈ మూవీ కోసం కె వి రెడ్డి పాత్ర కోసం ద‌ర్శ‌కుడు క్రిష్ ను, సింగీతం పాత్ర కోసం పెళ్ళి చూపులు ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ను తీసుకున్నారు.. ఇక ఎస్వీరంగారావు పాత్ర‌లో మోహ‌న్ బాబు క‌నిపించ‌నున్నాడు. ఈ పాత్రలకి ఖరారైన వాళ్ళూందరూ బయట మాత్రం మామూలుగానే కనిపిస్తున్నారు. పాత్రలకు దగ్గరగా ఉండే లక్షణాలూ ఏవీ కనిపించటం లేదు మరి.

కీర్తీ సురేష్ తప్ప

కీర్తీ సురేష్ తప్ప

అయితే ఇప్పటివరకూ కీర్తీ సురేష్ తప్ప ఎవరి లుక్ కూడా పెద్దగా బయటికి రాలేదు. బయట కూడా వాళ్లంతా మామూలుగానే కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు కంగన రనౌత్ హీరోయింగా తీస్తున్న "మణికర్ణిక" సెట్స్ నుంచి లీకైన ఒక ఫొటో చూస్తే మాత్రం క్రిష్ లుక్ ఎంత మారిపోయిందో అర్థమైపోతోంది.

ప్రెస్టీజియస్ గా రూపొందుతోన్న సావిత్రి బయోపిక్

ప్రెస్టీజియస్ గా రూపొందుతోన్న సావిత్రి బయోపిక్

క్రిష్ రూపురేఖలు ఎలా మార్చేసుకున్నాడో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మహానటి సినిమాలో నటించడం కోసం క్రిష్ ఇలా గెటప్ ఛేంజ్ చేసుకుంటున్నాడు. టాలీవుడ్ లో ప్రెస్టీజియస్ గా రూపొందుతోన్న సావిత్రి బయోపిక్ లో.. మాయాబజార్ దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో మెరవనున్నాడు క్రిష్. సావిత్రి లైఫ్ కి ఆ సినిమా చాలా ప్లస్ కాబట్టి.. కేవీ రెడ్డి పాత్ర కూడా సినిమాలో కీలకంగానే కనిపించనుంది.

 గెటప్ ను మార్చుకుంటున్నాడు

గెటప్ ను మార్చుకుంటున్నాడు

ఆ కేవీ రెడ్డి పాత్రలో ఒదిగిపోయేందుకు గాను.. అచ్చు అలాగే ఉండేలా తన గెటప్ ను మార్చుకుంటున్నాడు క్రిష్. నెత్తిన ఉన్న టోపీ పక్కనెట్టేస్తే.. ఆ మీసకట్టు.. మారిన ముఖకవళికలు చూస్తుంటే.. కేవీరెడ్డి పాత్రలో నటుడిగా కనిపించేందుకు ఈ దర్శకుడు ఎంతగా కసరత్తులు చేసేస్తున్నాడనే సంగతి అర్ధమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X