»   »  ఆ ఆయుధ తయారీఫ్యాక్టరీ తో దర్శకుడు క్రిష్ కి సంబంధం ఏమిటి..

ఆ ఆయుధ తయారీఫ్యాక్టరీ తో దర్శకుడు క్రిష్ కి సంబంధం ఏమిటి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

చారిత్రాత్మక నేపధ్యమున్న సినిమాలు తీయడం అంటేనే చాలెంజ్ కి ఎదురెళ్ళటమే. మామూలుగా చేసే పని కన్నా ఎక్కువ కష్టపడాలి. కాస్ట్యూమ్స్ దగ్గరి నుంచీ లొకేషన్ల వరకూ ప్రతీ చోటా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి, వున్న బడ్జెట్ లో అనుకున్న నిడివిలో విజువల్ ఎఫెక్ట్స్ ఎంతవరకూ వాడాలో తెలుసుకుంటూ అనవసర ఖర్చుని తగ్గించుకుంటూ ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా చూసుకోవాలి.

అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఆయుధాలు... యుద్దసన్నివేశాల కోసం వందలకోద్దీఆయుధాలు కావలసివస్తుంది. బాహుబలి,రుద్రమదేవీ వంటి చిత్రాల వరసలో ఇప్పుడు వస్తున్న మరో చిత్రం గౌతమీ పుత్రశాతకర్ణి కోసం కూడా ఆయుధాల ని తయారు చేయించే పనిలొ పడ్డాడట దర్శకుడు క్రిష్.

Krish to make weapens for Blakrishna's Gauthami puthra sathakarni

బాలయ్య 100వ సినిమా చారిత్రాత్మక వీరుడైన గౌతమీ పుత్రశాతకర్ణి నేపధ్యంలో తెరకెక్కే చిత్రం కాబట్టి యుద్ధసన్నివేశాలకు కొదవ లేదు. ఈ నేపధ్యంలో బాలయ్యతో పాటూ తక్కిన తారాగణమంతా వాడేందుకు అవసరమైన కత్తులు మరియు ఇతర యుద్ధ పరికరాలను,కవచాలనూ ఇంకా రథాలూ వంటి వాటి విడిభాగాలు తయారుచేసేందుకు ఏకంగా ఒక ఫ్యాక్టరీని స్థాపించినట్టు సమాచారం.

తన సొంత నిర్మాణ సంస్థ కాబట్టి ఖర్చుపెట్టే ప్రతీపైసాకి ఫలితం కనబడాలని కోరుకోవడం సబబే. ఈ చిత్రాన్ని మూడు వారాలపాటూ మొరాకోలో తెరకెక్కించనున్నారు. మే నుండి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు వున్నాయి.

English summary
Director Krish is making weapens to use in Blakrishna's Gauthami puthra sathakarni
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu