ఇంకా వివాదం లోనే క్రిష్ మణికర్ణిక: పాపం క్రిష్, ఇంత చికాకు అనుకోలేదేమో
మణికర్ణిక లో కంగనా ని హీరోయిన్ గా తీసుకోవటమే ఇప్పుడు క్రిష్ కి తలనొప్పిగా మారింది. ఇప్పుడు బాలీవుడ్ లో మొదలైన కొత్త వివాదం క్రిష్ ని కూడా ఇబ్బందుల్లో పడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగులో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా తర్వాత దర్శకుడు క్రిష్ జాగర్లమూడి బాలీవుడ్లో మరో చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఆయన తెరెక్కించబోయే 'మణికర్ణిక' మూవీ ప్రారంభోత్సవం ఈ మధ్యనే వారణాసి(కాశీ)లో జరిగింది. ఝాన్సీ రాణి లక్ష్మీ భాయి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కంగనా రనౌత్ లీడ్ రోల్
'బాహుబలి' రచయిత విజయేంద్రప్రసాద్ ఈచిత్రానికి కథ అందించారు. ఈ చిత్రంలో కంగనా రనౌత్ లీడ్ రోల్ చేస్తోంది. శంకర్-ఎస్సాన్-లాయ్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కొంటెంట్ స్టూడియోస్ బేనర్లో సంజయ్ కుట్రీ, నిషాద్ పిట్టి సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది అంటూ హోరెత్తించింది మీడియా...

జాతీయ అవార్డు హీరోయిన్
అయితే పాపం కంగనా లాంటి జాతీయ అవార్డు హీరోయిన్ ని తీసుకోవటమే ఇప్పుడు క్రిష్ కి తలనొప్పిగా మారింది... నీ ఇప్పుడు బాలీవుడ్ లో మొదలైన కొత్త వివాదం క్రిష్ ని కూడా ఇబ్బందుల్లో పడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఇప్పుడు బాలీవుడ్ లో ఏం జరిగిందీ.., దానికీ క్రిష్ కీ సంబందం ఏమిటీ అంటే..??

ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర
రెండేళ్ళ క్రితమే కంగనా రనౌత్‌తో 'రాణి ఆఫ్ ఝాన్సీ: ది వారియర్ క్వీన్' పేరుతో ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో ఆ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పిన కంగనా, అనూహ్యంగా దర్శకుడు కేతన్ మెహతాకి ఝలక్ ఇచ్చింది.

రాణి ఆఫ్ ఝాన్సీ
'రాణి ఆఫ్ ఝాన్సీ: ది వారియర్ క్వీన్', 'మణికర్ణిక' రెండూ ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన కథాంశాలే. పదేళ్ళపాటు కష్టపడి కేతన్ మెహతా, 'రాణి ఆఫ్ ఝాన్సీం ది వారియర్ క్వీన్' కథాంశాన్ని రెడీ చేశాడు.ఏమయ్యిందోగానీ, కంగనా - కేతన్ మెహతాకి హ్యాండిచ్చింది.

మణికర్ణిక
క్రిష్ డైరెక్షన్‌లో 'మణికర్ణిక' సినిమాకి జై కొట్టేసింది. ఈ సినిమా నిర్మాణంలో కూడా కంగనా రనౌత్ భాగం పంచుకుంటుండడం గమనార్హం. బాలీవుడ్‌లో గతంలోనే ఓ సినిమాకి దర్శకత్వం వహించిన క్రిష్, 'మణికర్ణిక' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది
'బాహుబలి' తర్వాత ఆ స్థాయి చిత్రం 'మణికర్ణిక' అవుతుందనే నమ్మకంతో వున్న క్రిష్‌కి, ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళకుండానే వివాదాలు ముంచెత్తుతుండడం మింగుడుపడని విషయమే మరి. చూస్తోంటే, కంగనా క్రిష్ తలమీద పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది... పాపం క్రిష్ కంగనా తో ఎలా వేగుతాడో ఏమో


Click it and Unblock the Notifications











