బాలయ్య ఇంట్లో ఆ దర్శకుడు.. చర్చలు జరుగుతున్నాయి!
క్రేజీ ప్రాజెక్ట్ గా ప్రారంభమైన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. ఘనంగా చిత్రం ప్రారంభమైన తరువాత దర్శకుడు తేజ ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం సినీవర్గాలని షాక్ కి గురిచేసింది. బాలకృష్ణతో ఎన్టీఆర్ చిత్ర కథ విషయంలో తేజకు విభేదాలు తలెత్తాయి. దీనితో తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తేజ మళ్ళీ విజయాల బాట పట్టాడు. ఆ నమ్మకంతోనే బాలయ్య తేజకు ఈ భాద్యతలు అప్పగించాడు.
తేజ తప్పుకున్న తరువాత మరో దర్శకుడిని ఎంపిక చేయడం బాలయ్యకు కత్తిమీద సాముగా మారింది. ఎట్టకేలకు ఈ విషయంలో కదలిక వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ కోసం పలువురి దర్శకుల పేర్లు వినిపిస్తుండగా వారిలో క్రిష్ కూడా ఉన్నారు. తాజగా క్రిష్ బాలయ్య నివాసంలో ఆయన్ని కలిసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో చర్చలు చివరిదశకు చేరుకున్నాయని, ఏ నిమిషంలో అయినా అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

క్రిష్ ఇది వరకే బాలయ్యతో గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాన్ని తెరకెక్కించారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో అనేక రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయి. దీనితో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











