వెరైటీగా ఉందే : క్రిష్ కొత్త చిత్ర టైటిల్
హైదరాబాద్ : గమ్యం, వేదం,కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాలతో విభిన్నచిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) త్వరలో నిర్మాతగా మారుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయవంతమైన సైవం చిత్రాన్ని తెలుగులో ఆయన రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఓ వెరైటి టైటిల్ అదీ తెలుగుతనం ఉట్టిపడే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం.
బాలీవుడ్‌లో గబ్బర్ చిత్ర షూటింగ్‌ని పూర్తిచేసిన దర్శకుడు క్రిష్ సైవం రీమేక్‌ని ఉషాకిరణ్ మూవీస్‌తో కలిసి నిర్మించబోతున్నాడని తెలిసింది. త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రానికి దాగుడుమూతలు దండాకోరు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడెవరు? నటీనటులెవరు? అనే విషయాల్ని చిత్ర వర్గాలు త్వరలో వెల్లడించనున్నాయని తెలిసింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ హీరోగా గబ్బర్ చిత్రాన్ని రూపొందించి తన తదుపరి చిత్రం నాగబాబు కుమారుడుతో చేయటానికి సిద్దంగా ఉన్నారు.
తమిళంలో నాన్న డైరక్టర్ విజయ్ రూపొందించిన ‘శైవం'కి ఇది రీమేక్ అని తెలుస్తోంది. ఈ చిత్రం చూసిన క్రిష్...బాగా నచ్చి రామోజీరావు గారికి ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. రామోజీరావు గారు సైతం ఈ చిత్రం చూసి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'నాన్న' చిత్రంలో ఆత్మీయ నటనను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్న సారా గుర్తుందిగా?.. ఆమె ప్రధాన పాత్రలో 'తలైవా' ఫేం ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శైవం'. తమిళంలో ఆ మధ్యన విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల నుంచి కితాబు అందుకుంది. ఇందులో సారా నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేసారు. విజయ్ కూడా మంచి విజయం దక్కిన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తెలుగు వెర్షన్ లో కూడా ఆమెనే తీసుకునే అవకాసం ఉంది. తాత, మనవరాలి మధ్య ఉన్న బంధం నేపథ్యంలో 'శైవం' తెరకెక్కించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని కేవలం ఓ కోడిపుంజు వేసి వదిలి, అందరినీ ఆశ్చర్యంలో పడేసారు.
ఇందులో 'దైవతిరుమగల్' ఫేం బేబీ సారా నటించటం ప్లస్ అయ్యింది. నాజర్ ముఖ్యపాత్ర పోషించారు. నాజర్ కుమారుడు బాషా కూడా ఈ సినిమా ద్వారా పరిచయమయ్యారు. 'శైవం' చిత్రాన్ని చూసిన రెడ్ జెయింట్ మూవీస్ బ్యానరు నిర్మాత, నటుడు ఉదయనిధి.. ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకొచ్చారు.
క్రిష్ విషయానికి వస్తే...
గతంలో క్రిష్...కంటెంట్ నే నమ్ముకుని గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం చిత్రాలు చేసారు. ప్రస్తుతం తమిళ రీమేక్ గబ్బర్ లో బిజీగా ఉన్నారు. గబ్బర్ చిత్రం తమిళ చిత్రం రమణ కు రీమేక్. రమణ చిత్రం తెలుగులో ఠాగూర్ గా వచ్చి హిట్టైంది. అక్షయకుమార్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రంపై బాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











