twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్నారి కోసం బాలయ్య ప్రాణాలను అడ్డుపెట్టాడు.. గుర్తు చేసుకొన్న క్రిష్

    త‌న‌పైకి వ‌స్తున్న వంద గుర్రాల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా బాల‌య్య ఓ చిన్నారిని కాపాడార‌ని క్రిష్ గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ నాటి ఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేసుకున్నాడు.

    |

    బాలయ్య తాను చేస్తున్న పాత్రలలో ఎంతగా లీనమైపోతాడో తెలిసిందే. గౌతమీపుత్ర శాతకర్ణి సమయం లోనూ బాలయ్య అదే స్థాయిలో పాత్రని ఆప్ట్ చేసేసుకున్నాడట. నిజంగా తాను ఒక రాజుగా చూపాల్సిన ధైర్యాన్ని ఒక చిన్నారి ప్రాణం కాపాడేందుకు 100 గుర్రాలు వెనుక వస్తున్నా లెక్క చేయకుండా ప్రయత్నిచటం మామూలు విషయమేం కాదు ఇదే విశయాన్ని మొన్న ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ గుర్తు చేసుకున్నాడు ఆ సినిమా దర్శకుడు క్రిష్.

    Recommended Video

    Balakrishna's 102 movie photos leaked in media
     బాలయ్య తీవ్రమైన ప్రమాదం లో పడి ఉండేవాడు

    బాలయ్య తీవ్రమైన ప్రమాదం లో పడి ఉండేవాడు

    త‌న‌పైకి వ‌స్తున్న వంద గుర్రాల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా బాల‌య్య ఓ చిన్నారిని కాపాడార‌ని క్రిష్ ఆనాటి ఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయం లో గనక హార్స్ ట్రైనర్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న బాలయ్య తీవ్రమైన ప్రమాదం లో పడి ఉండేవాడనీ, కానీ చేతుల్లో ఉన్న చిన్నారి కోసం ఆయన అంతటి ప్రమాదాన్ని కూడా లెక్క చేయలేదనీ చెప్పాడు. ఇంతకీ ఆరోజు ఏం జరిగిందంటే...

    ప్రాణాల‌కు తెగించి

    ప్రాణాల‌కు తెగించి

    క్రిష్, బాల‌య్య‌ల కాంబోలో తెర‌కెక్కిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ను క్రిష్ 3నెల‌ల్లో పూర్తి చేశాడు. అయితే, ఆ షూటింగ్ సమయంలో అనుకోకుండా ఓ ఘటన జ‌రిగింద‌ట‌. గుర్రపు స్వారీ చేస్తున్న స‌మ‌యంలో బాల‌య్య ప్రాణాల‌కు తెగించి ఓ చిన్నారిని కాపాడార‌ట‌.

     హార్స్ రైడింగ్ బాగా తెలుస‌ు

    హార్స్ రైడింగ్ బాగా తెలుస‌ు

    బాలకృష్ణ కి హార్స్ రైడింగ్ బాగా తెలుస‌ని, ఆయన కోసం తెప్పించిన‌ అరేబియన్ గుర్రాన్ని ఆయ‌న అవ‌లీల‌గా మచ్చిక చేసుకున్నారని క్రిష్ చెప్పారు. ఓ స‌న్నివేశం చిత్రీక‌రిణ‌ సంద‌ర్భంగా....బాల‌య్య ఓ చిన్నారిని తీసుకుని గుర్రంపై వెళుతున్న దారికి రెండు వైపులా అమర్చిన‌ బాంబులు ఒకేసారి పేల‌క ముందుగా కుడి వైపు ఉన్న బాంబు మాత్రమే పేలటం తో బెదిరిపోయిన గుర్రం ఎడమవైపుకు తిరిగింది.

    బాలకృష్ణ గుర్రంపై నుంచి పడిపోయార‌ు

    బాలకృష్ణ గుర్రంపై నుంచి పడిపోయార‌ు

    దాంతో బ్యాలెన్స్ చేసుకోవటం కష్టమయ్యింది. . దీంతో గుర్రం బెదిరిపోయి ఎడమవైపుకు తిర‌గ‌డంతో ఆ కుదుపుకు బాలకృష్ణ గుర్రంపై నుంచి పడిపోయార‌ు. ఆ స‌మ‌యంలో చిన్నారికి ఎక్కడా దెబ్బ తగలకుండా గట్టిగా పొదివి పట్టుకున్నార‌ట‌. కిందపడిపోయి ఉన్న బాల‌య్య వెనుకే వంద గుర్రాలు వచ్చేస్తున్నాయ‌ని క్రిష్ చెప్పారు.

     చిన్నారి ప్రాణాలు కాపాడటం మీదే బాలయ్య దృష్టి

    చిన్నారి ప్రాణాలు కాపాడటం మీదే బాలయ్య దృష్టి

    దీంతో, అప్ర‌మ‌త్త‌మైన హార్స్ ట్రైనర్....బాలయ్య గుర్రాన్ని అడ్డుగా నిలపడంతో అవన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయని, అలా తృటిలో పెను ప్రమాదం నుంచి బాల‌య్య బ‌య‌ట‌ప‌డ్డారని వెల్ల‌డించారు. ఆ సమయం లో ఆయనకు తగిలే దెబ్బలనీ, వెనుక వస్తున్న ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా చిన్నారి ప్రాణాలు కాపాడటం మీదే బాలయ్య దృష్టి ఉండటాన్ని మళ్ళీ గుర్తు చేసుకున్నాడు క్రిష్.

    English summary
    In a recent interview Tollywood director Krish Krish recalls Balayya saving a Kid's life in Gauthamiputra Satakarni shooting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X