క్రిష్ లేటెస్ట్ 'వేదం' రిలీజ్ డేట్ ఎప్పుడు?
గమ్యం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరక్టర్ గా మారిన క్రిష్...తాజాగా 'వేదం' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే 12 వ తేదీన రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ 70శాతం పూర్తయింది. రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలి. అయిదు పాత్రలతో, అయిదు కథలతో సరదాగా సాగే విభిన్న చిత్రం ఇది. అల్లు అర్జున్ ఒక కథ, మనోజ్‌ది ఒక కథ, అనుష్కది ఒక కథ, మనోజ్ వాజ్‌పాయ్‌ది మరో కథ..ఇలా ఉంటుంది సినిమా. మనోజ్, అల్లు అర్జున్ కలిసి పాల్గొనే సన్నివేశాలు క్లైమాక్స్ లో ఉంటాయి. రియలిస్టిక్ ఎప్రోచ్ కలిగిన హ్యుమన్ డ్రామా ఈ సినిమా దీనిని వర్ణిస్తున్నారు. ఇక అనుష్క ఇందులో సరోజ అనే వేశ్యగా కనిపంచనుంది. అలాగే అల్లు అర్జున్...స్లమ్ లో తిరిగే మాస్ కుర్రాడుగా ఉంటాడు. మనోజ్ ఓ రాక్ స్టార్ గా ఉంటాడు. అలాగే అల్లు అర్జున్ పక్కన దీక్ష సేధ్ నటిస్తోంది. దాదాపు 40 నిమిషాల నుంచి గంట సేపుంటుంది అల్లు అర్జున్ పాత్ర..ఈ సినిమాపై పరిశ్రమలో మంచి హైప్ ఉంది.


Click it and Unblock the Notifications











