twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మ పై క్రిష్ కవిత

    |

    గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురమ్ వంటి డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు. అతనిలో మంచి భావుకుడు దాగున్నాడు.అయితే ఈ విషయం ఇండస్ట్రీలో కొద్దిమందికే తెలుసు.

    ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ప్రెస్టీజియస్ 100వ చిత్రం "గౌతమీపుత్ర శాతకర్ణి" పనుల్లో బిజీగా ఉన్న క్రిష్. మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లి గొప్పదనాన్ని చాటుతూ.. "అమ్మ నవ్వింది" పేరుతో ఒక కవిత రాసి. తన ట్వట్టర్ లో పోస్ట్ చేసాడు. ఆ కవిత ఇలా సాగింది.....

    మా అమ్మ నవ్వింది..

    నీకు నేను జీవితాన్నిస్తే

    అందులోంచి ఏడాదికో రోజు నాకిస్తున్నావా అనీ

    నీ ప్రతీ రోజూ నాదేరా పిచ్చిసన్నాసి అని..

    దగ్గర లేనని బాధ పడుతుంటే మళ్లీ నవ్వింది..

    అమ్మ విలువ చాటి చెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణి

    షూటిం కోసం దూరంగా మొరాకోలో ఉన్నావుగా..

    అమ్మలందరి దగ్గర నువ్వున్నట్లే అని..

    నాకు నవ్వొచ్చింది..

    కాదు

    మా అమ్మ నవ్వించింది"

    Krish Written apoem For His Mother During Mothers Day

    అంటూ కవిత లోనే ఇప్పుడు తనెక్కడుందీ చెప్పాడు క్రిష్. బాలకృష్ణ "గౌతమీపుత్ర శాతకర్ణి" కోసం మొరాకోలో ఉన్న సంగతి మరోసారి ఈ కవిత ద్వారా చెప్పాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజే మొదలు పెడుతున్నారు. సినిమాకు ఎంతో కీలకం అయిన వార్ ఎపిసోడ్ ని అక్కడ చిత్రీకరించబోతున్నారు. దీని కోసం రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ వందో సినిమాను క్రిష్ సొంత సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు. క్రిష్ ఆస్థాన రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తాడు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నాడు క్రిష్.

    English summary
    Director Radhakrishna Jagarlamudi (krish) wrote a poem on his mother During Mothers Day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X