అదుపు తప్పుతోందనే మహేష్ జోక్యం
హైదరాబాద్ : ప్రస్తుత చిత్ర పరిశ్రమలో మంచి సినిమాలొస్తున్నాయి. అయితే నిర్మాణ వ్యయమే అదుపు తప్పుతోంది. రూ. 40 కోట్లతో సినిమాలు తీసేయొచ్చు. కానీ 60 కోట్లు, 70 కోట్లు అంటున్నారు. ఆ సినిమాలు విజయవంతమైనా నిర్మాతకి లాభాలు రావడం లేదు అంటున్నారు సూపర్ స్టార్ కృష్ణ.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అలాగే మహేష్ నటించిన '1'(నేనొక్కడినే), 'ఆగడు' చిత్రాలకి రూ. 70కోట్లు ఖర్చయ్యాయని అన్నారు. అందుకే ఇప్పుడు చేస్తున్న సినిమా విషయంలో మహేష్ జోక్యం చేసుకొంటున్నాడు. నిర్మాణ వ్యయం అదుపు తప్పకుండా అన్నింటినీ తనే పర్యవేక్షిస్తున్నాడు. పారితోషికం కూడా తగ్గించుకొన్నాడు అని చెప్పుకొచ్చారు.

అలాగే పరిశ్రమలో మహేష్ నా స్థానాన్ని నిలబెట్టాడు. కథల విషయంలో నాలాగే ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడున్నవాళ్లల్లో నా అభిమాన హీరో తనే. మహేష్‌ని జేమ్స్‌బాండ్ చిత్రాల్లో చూడాలనే కోరిక ఉంది. అలాంటి కథ తనకి ఎప్పటికి దొరుకుతుందో మరి. మంచి కథ దొరికితే నేను, మహేష్, నా మనవడు గౌతమ్‌కృష్ణ కలిసి నటిస్తాం.
ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన 'తేనె మనసులు'తో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు కృష్ణ. ఆ చిత్రం 1965 మార్చి 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంటే కృష్ణ సినీ ప్రయాణం నేటితో యాభయ్యేళ్లు పూర్తి చేసుకొంటుందన్నమాట. ఈ సందర్భంగా కృష్ణ మీడియాతో ముచ్చటించింది.


Click it and Unblock the Notifications











