రౌడీ నెం.1 తర్వాత శారదతో మళ్లీ ఇన్నాళ్లకు : కృష్ణ
ఆది, నిషా అగర్వాల్ జంటగా పిల్ల జమిందార్ ఫేం జి. అశోక్ దర్శకత్వంలో శ్రీ సౌదామిని క్రియేషన్స్ బ్యానర్‌పై కె.వి.వి సత్యానారాయణ సమర్పణలో కె వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం 'సుకుమారుడు'. ఈచిత్రం విశేషాలను తెలియ జేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ...నేను శారద ఇదే బ్యానర్లో రౌడీ నెం.1 చిత్రంలో నటించాము. చాలా కాలం తర్వాత మళ్లీ ఆమెతో కలిసి ఈచిత్రంలో నటిస్తున్నాను. దర్శకుడి కోరిక మేరకు ఓ చిన్న పాత్ర చేస్తున్నాను. సుకుమారుడు చిత్రం హిట్టయి ఆది కెరీర్‌కి ప్లస్సవుతుంది అని చెప్పారు. హీరో ఆది మాట్లాడుతూ ఈ చిత్రం యూత్ కి నచ్చుతుంది. అనూప్ అందించిన పాటలు బాగున్నాయి. ఇంత మంది సీనియర్లతో నటించడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నా అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ...ఫ్యామిలీ సెంటిమెంట్‌తో యూత్ మెచ్చే లవ్ యాంగిల్ టచ్ చేస్తూ తెలుగుదనం ఉట్టి పడేలా ఈ ట్రెండకు తగిన విధంగా సినిమా ఉంటుంది. ఈతరం యువకుడి పాత్రలో ఆది, ఓ పెద్ద కుటుంబంలో అందాల గారాల పట్టీగా నిషా నటిస్తోందని తెలిపారు.
ఈ చిత్రంలో శారద, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రావు రమేష్, ధనరాజ్, గొల్లపూడి మారుతీరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మాటలు: చంద్రశేఖర్ గుండెమేడ, ఆర్ట్: ఎ. రామాంజనేయులు, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సంగీతం: అనూప్ రూబెన్స్, సహ నిర్మాత: బాబ్జి, నిర్మాత: కె. వేణుగోపాల్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి అశోక్.


Click it and Unblock the Notifications












