మద్యం కిక్కులో కాలేజీ ఫంక్షన్ కు కృష్ణ భగ్వాన్?
మద్యం కిక్కులో హాస్యనటుడు ఓ కళాశాల ఫంక్షన్ కు హాజరు కావడం వివాదంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ కాలేజీ ఫంక్షన్ కు కృష్ణ భగ్వాన్ ను పిలిచారు. తాను రమణ మహర్షి శిష్యుడిని అని చెప్పుకునే కృష్ణ భగ్వాన్ రాక వల్ల విద్యార్థులకు, విద్యా సంస్థకు మంచి జరుగుతుందని భావించి ఉండవచ్చు. కానీ కళాశాల యాజమాన్యం విమర్శలకు గురి కావడానికి ఆయన కారణమయ్యారు. మద్యం సేవించి వచ్చిన ఆయన మైకు ముందు నిలబడి మాట్లాడడానికి నానా యాతన పడ్డారు. చెమటలు పడుతున్న ముఖం తుడుచుకుంటూ, అటూ ఇటూ ఊగిపోతూ ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఆయనకు కూడా అర్థమై ఉండదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మద్యం కిక్కులో ఉన్న కృష్ణ భగ్వాన్ ను కాలేజీ ఫంక్షన్ కు ఆహ్వానించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణ భగ్వాన్ తెలుగు నటుడు కళాశాల ఫంక్షన్ మద్యం కిక్కు krishna bhagwan telugu actor college function boozing


Click it and Unblock the Notifications