twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గాలి జనార్థన్‌రెడ్డిని పోలి ఉందనే విమర్శపై దర్శకుడు క్రిష్

    By Srikanya
    |

    హైదరాబాద్ :దర్సకుడు క్రిష్ తాజా చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్‌'సినిమాలోని రెడ్డప్ప పాత్ర గాలి జనార్థన్‌రెడ్డిని పోలి ఉందని అంటునే కామెంట్స్ వినిపిస్తున్న నేపధ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..నేను ఏ ఒక్కరినో లక్ష్యంగా చేసుకొని ఈ సినిమా తీయలేదు. జాతీయ సంపద దోచుకెళ్లే వారి గురించి సినిమా తీశాను. మట్టిని మెక్కేస్తోంటే.. గుడ్లప్పగించి చూస్తున్న బీటెక్‌ బాబుల గురించి ఈ సినిమా తీశాను అన్నారు.'కృష్ణం వందే జగద్గురుమ్‌'లో మైనింగ్‌ మాఫియా సమస్యకు నాటకం, జీవితం, భాగవతంతో అందమైన ముడివేశాడు.నాటక సమాజం, మైనింగ్‌ మాఫియా, భగవద్గీత సారాంశం వీటన్నింటినీ ఒకే కథలో మేళవించారు.

    అలాగే ప్రేక్షకులను తక్కువగా అంచనా వేయడం నాకు ఇష్టం లేదు. వారిని ఎప్పుడూ నేను ఉన్నతంగానే ఊహిస్తా. అవినీతి అనేది అందరి సమస్య. నిత్యం కార్లలో తిరిగేవాడికి ఆ సమస్య అర్థమైనా కాకపోయినా.. రిక్షా తొక్కేవాడు తొందరగా అర్థం చేసుకొంటాడు. సినిమా చూసి చప్పట్లు కొట్టే వందమంది కంటే... 'అరె.. ఇది నిజమే కదా?' అని అప్రమత్తమయ్యే ఒక్క ప్రేక్షకుడే నాకు కావాలి. నాకు మట్టిరాజులు, టిప్పు సుల్తాన్‌లే కావాలి. నేనెప్పుడు కథ రాసుకొన్నా వారి కోణంలోంచే ఆలోచిస్తా అన్నారు.

    'కృష్ణం వందే జగద్గురుమ్‌' నేను అనుకొన్న లక్ష్యాన్నినూటికి నూరు శాతం చేరుకొంది. 'గమ్యం', 'వేదం' సినిమాలు దర్శకుడిగా నాకు సంతృప్తినిచ్చాయి. మరోసారి ఆ తరహా సినిమాలే తీయడం నాకు ఇష్టం లేదు. 'ఏంటి? వీడికి ఇవి తప్ప మరేం రావా?' అనుకొంటారని భయం. ఒకే మూసలో ఇరుక్కుపోకూడదనే తాపత్రయం. అందుకే వ్యాపార సూత్రాలు మేళవించి ఓ సాహసోపేతమైన కథ చూపిద్దామనుకొన్నా. ఆ లక్ష్యం ఈ సినిమాతో అందుకొన్నా అని వివరణ ఇచ్చారు.

    ఇక సినిమా అంటే వ్యాపారాత్మక కళ. నా ఉనికిని కాపాడుకొంటూ, నాకుగా నేను నిలదొక్కుకొంటూ డబ్బులొచ్చే సినిమా తీయాలి. 'గమ్యం'లాంటి సినిమా ఎవరు చూస్తారో నాకు తెలుసు. కాబట్టి దాన్ని పరిమిత బడ్జెట్‌లో తీశా. 'వేదం' సినిమాకు కొన్ని ప్రాంతాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇంకొన్ని చోట్ల ఓ మోస్తరు సినిమా అనే ముద్ర వేశారు. నాకిప్పుడు అందరినీ మెప్పించే సినిమా తీయడం అవసరం. స్టార్‌తో జత కడితే సినిమాకి మంచే జరుగుతుంది. ఆ కథకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. 'వేదం' సినిమానే తీసుకోండి. అందులో అల్లు అర్జున్‌, అనుష్కలు లేకపోతే ఆ సినిమాని ఊహించుకోవడమే కష్టం. నా తరవాత సినిమా కూడా ఓ స్టార్ హీరోతో ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

    English summary
    
 Speculations are making rounds that Krish targeted Mining king in Bellary ‘Gali Janardhan Reddy’. Director Krish and Posani krishna Murali who played a key role in the movie condemned the gossips that ‘Reddappa’ character in the movie is a clone to ‘Gali Janardhan Reddy’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X