గిల్టీ ఫీలవుతున్న కృష్ణ..
సూపర్ స్టార్ కృష్ణకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలియంది కాదు. వారు అప్పట్లో కృష్ణ కూతురు మంజుల సినీ రంగ ప్రవేశంపై నిరసన వ్యక్తం చేసారు. దాంతో ఆమె విరమించుకుని చాలా కాలం గ్యాప్ తీసుకుని నీలకంఠ షో తో బయిటకు వచ్చింది. ఆ చిత్రంలో ఆమె తన నటనా టాలెంట్ చూపినా బయిటనుంచి అవకాశాలేమీ వెతుక్కుంటూ రాలేదు. అందులోనూ ఆమె పెళ్ళి చేసుకుని సెటిలవ్వటం, బ్యానర్ పెట్టి సినిమాలు చేయటం పై కాన్సర్టెట్ చేసింది. ఈ క్రమంలో తెరకు దూరమయిన ఆమె మళ్ళీ కావ్యాస్ డైరీతో ముందుకొచ్చింది. ఆ సినిమా డివైడ్ టాక్ తో ముందుకెళ్ళతున్నా ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి. దాంతో కృష్ణ ప్యాన్స్ ఆమెను అప్పట్లో ఆపుచేసినందుకు గిల్టీగా ఫీలవుతున్నారు. ఆమెలో మంచి నటన ఉందని అది అప్పట్లో బయిటపడి కంటెన్యూ అయితే ఈపాటికి స్టార్ స్దాయిలో ఉంటుందని అంటున్నారు. వారు అబిమానంతోనో, లేక నిజంగానో ఆ మాటలు అంటున్నా ఆమెను ఆపుచేసినందుకు మాత్రం గిల్టిగా ఫీలవుతున్నారనేది సుస్పష్టం అంటున్నారు.


Click it and Unblock the Notifications











