‘దూకుడు’అద్బుతం ఒప్పుకోక తప్పదు అంటూ...
'దూకుడు"చిత్రం తప్పకుండా ఓ అద్భుతమే.అద్భుతాలను ఎవరూ ముందుగా గుర్తించలేరు. గుర్తించిన తరవాత ఒప్పుకోక తప్పదు అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు.శనివారం సాయంత్రం విజయవాడలో జరిగిన 'దూకుడు"అర్ధశతదినోత్సవంలో కృష్ణ పైవిధంగా స్పందించారు.ఆయన మాట్లాడుతూ..మహేష్ చిన్నతనం నుంచే ప్రతి షాట్‌లో డూప్‌లు లేకుండా నటించటానికి తాపత్రయపడేవాడు.చిన్నప్పుడు మహేష్‌బాబు నటించిన సినిమా చూసి ఈ అబ్బాయి పెద్దయ్యాక పెద్ద స్టార్ అవుతాడు... రికార్డులు సృష్టిస్తాడు అని నిర్మాత డూండీ అన్నారు. అది ఇప్పుడు నిజం అవుతుంది. చరిత్ర తిరగరాసే విజయాలను మహేష్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఆ తర్వాత విజయనిర్మల మాట్లాడుతూ..''నేను ఏ సినిమా అయినా ఒకసారే చూస్తాను. దూకుడు చిత్రాన్ని మూడుసార్లు చూశాను. మహేష్ అందం, నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఎన్టీఆర్ ప్రధానమంత్రి కావాలన్న అందరి ఆశని దర్శకుడు ఈ చిత్రంలో నిజం చేశారన్నారు''. ఇక హీరోయిన్ సమంత ధరించిన వస్త్రాలను 'మా' ఆధ్వర్యంలో వేలం వేయగా తిరుపతికి చెందిన మధుసూదనరెడ్డి,రవి వాటిని కొనుగోలు చేశారు. వారికి ఆ దుస్తులను వేదికపై మహేష్, సమంత అందజేశారు. చిత్ర బృందానికీ, పంపిణీదారులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు కె.రాఘవేంద్రరావు, జి.ఆదిశేషగిరిరావు, సి.అశ్వనీదత్, సాగర్, సురేష్‌బాబు, డా||కేఎల్ నారాయణ, సమంత, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











