షాకింగ్: బేబీ సినిమాలో వైష్ణవిని పెళ్లి చేసుకున్నది ఆ స్టార్ డైరెక్టర్ తమ్ముడే
చిన్న సినిమాగా విడుదల అయి పెను సంచలనం సృష్టించిన మూవీ బేబి. ఇక ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఇందులో ఇద్దరిని ప్రేమించిన వైష్ణవి.. ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆ వ్యక్తిపై సోషల్ మీడియాలో తెగట్రోలింగ్ కూడా జరిగింది. ఇంతకీ ఆ వ్యక్తి ఓ స్టార్ డైరెక్టర్ కు తమ్ముడు అంట. ఆయన ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రల్లో వచ్చిన బేబీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం యూత్ కు బాగా కనెక్ట్ అయి... దాదాపు 100కోట్ల వసూళ్లు రాబట్టింది. దర్శకుడు సాయి రాజేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఏడు కోట్ల రూపాయలతో ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక బేబీ చిత్రంలో వైష్ణవి ఇద్దరి యువకులను ప్రేమిస్తుంది. చిన్నప్పుడే ఓ యువకుడితో ప్రేమలో పడి.. ఆ తర్వాత కాలేజ్ లో ఓ వ్యక్తితో ప్రేమో, స్నేహమో తెలీకుండా అతని మాయలో పడిపోతుంది. ఇలా ఇద్దరి లైఫ్ లో ఓ కల్లోలం సృష్టిస్తూ.. తన లైఫ్ ను కూడా రిస్కులో పడేసుకునే క్యారెక్టర్ లో వైష్ణవి అద్భతంగా నటించింది. అయితే చివరకు ఈ సినిమాలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.
అయితే వైష్ణవి చేసుకున్న ఆ వ్యక్తిపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయిన సంగతి తెలిసిందే. ఆ అమ్మాయి ఒకరిని ప్రేమించి... మరొకరితో డేట్ చేసి.. ఇంకొకరిని పెళ్లి చేసుకుంది అంటూ ట్రోలింగ్ అవుతూ వచ్చింది. అయితే ఆ వ్యక్తి ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ కనిపించాడు. అయితే ఈ వ్యక్తి ఓ స్టార్ డైరెక్టర్ కు తమ్ముడు అని తెలుస్తోంది.
బేబీ సినిమాలో వైష్ణవిని పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు కృష్ణ మల్లిడి. ఇప్పటికే ఈ వ్యక్తి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. కలర్ ఫోటో సినిమాలో కూడా హీరోకి సీనియర్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. చాలా సినిమాలు చేసినా నటుడిగా బ్రేక్ రావడం లేదు అయితే బింబిసార లాంటి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ వశిష్టకు బ్రదర్ అని తెలుస్తోంది.

అంతే కాకుండా హాట్ యాంకర్ విష్ణుప్రియకు కూడా ఇతను రిలేటివ్ అవుతాడట. అతని సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోలు కూడా షేర్ చేశాడు కృష్ణ మల్లిడి. ఇక బేబీ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాతోనే ఆనంద్ దేవరకొండకు మంచి బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











