కృష్ణగారిని అలా వాడుకుంటున్నారు
రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో విడుదలైన 'ప్రేమకథా చిత్రమ్' విమర్శకుల ప్రశంసలందుకుంటోందని సూపర్‌స్టార్ కృష్ణ అభిప్రాయపడ్డారు. మారుతీ టాకీస్ బ్యానర్‌పై సుధీర్‌బాబు, నందిత జంటగా నటించిన ఈ చిత్రాన్ని బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపిచంద్‌తో కలిసి కృష్ణ ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ సుధీర్, నందితల నటనతో పాటు 'పచ్చనికాపురంలోని వెన్నెలైనా చీకటైనా' రీమెక్‌పాట తనకెంతో నచ్చిందని కితాబిచ్చారు. ఈ చిత్రం మరింత ఘనవిజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సినిమాకి అయిన ఖర్చుకన్నా పదింతలు లాభం రావాలి. నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ కథని అద్భుతంగా నడిపించాడు దర్శకుడు. తొలి సినిమా 'ఎస్‌ఎమ్‌ఎస్'తో పోలిస్తే... ఇందులో సుధీర్ బాగా చేశాడు. హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేసింది. నా 'పచ్చని కాపురం'లోని 'వెన్నెలయినా..' పాటను రీమిక్స్ చేసిన విధానం, 'అగ్నిపర్వతం'లోని పాటను టైటిల్ బ్యాక్‌డ్రాప్‌లో వాడిన వైనం ప్లస్ అయ్యింది.
మారుతీ టాకీస్ బ్యానర్‌పై సుధీర్‌బాబు, నందిత జంటగా నటించిన 'ప్రేమకథా చిత్రమ్' శుక్రవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. ప్రేమకథకు సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్‌ను జోడించి ప్రభాకర్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షలను ఆకట్టుకుంటున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
సుధీర్‌లో చక్కని నటుడున్నాడని ప్రూవ్ అయ్యిందని, తనకి మంచి భవిష్యత్తు ఉందని బ్యాడ్మింటన్ క్రీడా కారుడు పుల్లెల గోపీచంద్ అన్నారు. ఈ సినిమా బాగా రావడానికి యూనిట్ మొత్తం కారణమని మారుతి అన్నారు. సినిమాల పరంగా నా రోల్ మోడల్ మా మామయ్య కృష్ణ అని, విడిగా పుల్లెల గోపీచంద్ రోల్ మోడల్ అని సుధీర్ చెప్పారు. ఈ సమావేశంలో చిత్రదర్శకుడు కూడా పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications












