మహేష్ బాబు సినిమాకు దర్శకత్వం వహిస్తా: సూపర్ స్టార్ కృష్ణ
మంచి కథ దొరికితే తాను తన తనయుడు మహేష్ బాబు చిత్రానికి దర్శకత్వం వహిస్తానని మంగళవారం 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ కృష్ణ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. మహేష్ బాబు కథానాయకుడుగా తాను దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని అయితే అందుకు మంచి కథ దొరికి తమకు నచ్చాలని చెప్పారు.
మహేష్ సహజ నటుడు అని అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. తనను, తనతో పాటు తన తనయుడిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మహేష్ బాబు స్టైల్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందన్నారు. మహేష్ బాబుకు ఎప్పుడు ఇలాగే ప్రేక్షకులు, అభిమానుల అండ ఉండాలని కోరుకున్నారు.


Click it and Unblock the Notifications











