అర్థనగ్నంగా..: 'కృష్ణ ష్రాఫ్' హాట్ ఫోటో షూట్.. ఎదపై టాటూ..
Recommended Video

సినిమాలతో పని లేకుండా కేవలం తన హాట్ ఫోటో షూట్స్ తోనే సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకుంది జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్. బికినీతో, టాప్ లెస్ పోజులతో కుర్ర కారు మతి పోగొడుతూ అడపాదడపా వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. మరోసారి హాట్ హాట్ గా రెచ్చిపోయిన ఈ బ్యూటీ.. ఈసారి మరో టాప్ లెస్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

టాప్‌లెస్ ఫోటో:
ఎదభాగం పైనుంచి వీపు వరకు టాటూ వేసుకున్న కృష్ణ ష్రాఫ్.. డార్క్ లైట్‌లో ఫోటో షూట్ చేసింది. ఈ చిత్రాలు పర్సనల్‌గా బెడ్ రూమ్ లోనే తీయించుకున్నట్లు తెలుస్తోంది.

డోంట్ కేర్ మెంటాలిటీ..:
బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ చెల్లెలు అయి ఉండి.. కృష్ణ ష్రాఫ్ ఇలాంటి ఫోటో షూట్స్ చేయడం పట్ల కొంతమంది నెటిజెన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినా అవేవి డోంట్ కేర్ అంటోంది జాకీ ష్రాఫ్ తనయ.

ప్రస్తుతం ఏం చేస్తోంది?:
తెరంగేట్రం చేయాలన్న ఉద్దేశంతోనే కృష్ణ ష్రాఫ్ ఇలా హాట్ ఫోటోలతో రెచ్చిపోతుందన్న వాదన ఉంది. అయితే గత రెండేళ్లుగా ఆమె ఇలాంటి పోస్టులు చేస్తూనే ఉంది తప్పితే సినిమాల వైపు చూడలేదు. సోదరుడు టైగర్ ష్రాఫ్ నటించిన ఓ సినిమాకు మాత్రం నిర్మాతగా పనిచేసినట్లుంది. 'బ్లాక్ షీప్' అనే డాక్యుమెంటరీలోనూ ఆమె నటించింది.

జాకీ ష్రాఫ్ ఏమంటున్నారు?:
కృష్ణ ష్రాఫ్ హాట్ ఫోటో షూట్స్ విషయాన్ని జాకీ ష్రాఫ్ వద్ద ప్రస్తావిస్తే.. తన కొడుకు, కూతురి వ్యక్తిగత విషయాల్లో తాను తలదూర్చనంటూ గతంలోనే తేల్చేశారాయన. వాళ్లిద్దరికీ తాను పూర్తి స్వేచ్చ ఇచ్చానని, తప్పొప్పులు నిర్ణయించుకునే వయసు వారికి ఉందని చెప్పారు.


Click it and Unblock the Notifications











