సినీ నటులు రాజకీయాల్లో పనికి రారనే బియస్పీ నేత మాయావతి ప్రకటనను ప్రముఖ సినీనటుడు కృష్ణ ఖండించారు. సినీ నటులు రాజకీయాల్లో పనికి రారని అనడం సరి కాదని ఆయన అన్నారు. సినీనటులు రాజకీయాల్లోకి రావచ్చునని ఆయన తేల్చి చెప్పారు. సినీ నటులు రాజకీయాల్లోకి వస్తే అద్భుతాలు చేస్తారని అయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ప్రదానం చేసే గౌరవ డాక్టరేటును స్వీకరించడానికి ఆయన విశాఖపట్నం వచ్చారు. తాను చదువుకున్న విశ్వవిద్యాలయం నుంచే తాను గౌరవ డాక్టరేట్ తీసుకోవడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. కథ దొరికితే తాను, తన కుమారుడు కలిసి సినిమా చేస్తామని ఆయన చెప్పారు.
Story first published: Friday, July 17, 2026, 15:01 [IST]