అలా చేస్తే వ్యభిచారం చేసినట్టే.. ఖడ్గం రీ రిలీజ్‌పై కృష్ణవంశీ ఎమోషనల్ కామెంట్స్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్వకత్వంలో రూపొందిన సూపర్ హిట్ చిత్రం ఖడ్గం. 2002 సంవత్సరలో రిలీజైన ఈ సినిమాకు సుంకర మధు మురళీ నిర్మాతగా వ్యవహరించారు. శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్, సొనాలీ బింద్రే, సంగీత, కిమ్ శర్మ తదితరులు నటించారు. ఈ సినిమాకు నటుడు ఉత్తేజ్, సత్యానంద్ మాటలు అందించారు. అయితే దాదాపు 22 తర్వాత ఈ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. ఈ సినిమా గురించి కృష్ణవంశీ మాట్లాడుతూ..
హైదరాబాద్‌లోని పాత బస్తీలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకొని రాసుకొన్న కథతో ఖడ్గం రూపొందించాం. ఆ సినిమాకు అనూహ్యమైన ఆదరణ అన్ని వర్గాల నుంచి వచ్చింది. ఆ సినిమా భారీ కలెక్షన్లు సాధించడమే కాకుండా అవార్డులను కూడా తెచ్చిపెట్టింది అని కృష్ణవంశీ తెలిపారు. ఈ సినిమాకు ఐదు నంది, ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి. హిందీలో ఇన్సాన్ అనే పేరుతో రీమేక్ చేశామన్నారు.

అయితే కథ రాసిన తర్వాత ముందుగా అనుకొన్న ప్రకారమే రవితేజ, శ్రీకాంత్ హీరోలుగా అనుకొన్నాం. అప్పటికే నేను సొనాలి బింద్రేతో మురారీ సినిమాతో పనిచేయడం వల్ల నేను అడగగానే ఆమె ఆ పాత్రకు ఒప్పుకొన్నారు. సొనాలి బింద్రేతో పనిచేయడం హ్యాపీ. ఆ పాత్రలో ఆమె కనిపించడం ఆ సినిమాకు ప్లస్ అయింది అని అన్నారు.
ఖడ్గం సినిమా చాలా మందికి పేరు తెచ్చి పెట్టింది. సంగీత, 30 ఇయర్స్ పృథ్వీలాంటి వారికి మంచి కెరీర్ అందించింది. ఒక్క ఛాన్స్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఆ సినిమా నాకు పూర్తిగా సంతృప్తిని అందించింది. నాకు ఇష్టమైన కొన్ని సినిమాల్లో ఒకటి కూడా అని కృష్ణ వంశీ తెలిపారు.

నాకు నచ్చిన చిత్రాల్లో గులాబీ, సింధూరం, అంతపురం, ఖడ్గం లాంటి సినిమాలను చాలా ఇష్టపడి చేశాను. అందుకే నా మనసుకు దగ్గరయ్యాయి. కొన్ని సినిమాలు నాకు నచ్చలేదు. అలాంటి సినిమాలతో పనిచేసినప్పుడు వ్యభిచారం చేసినట్టే అనిపిస్తుంది. కొన్ని సినిమాలు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్పి వచ్చింది అని కృష్ణవంశీ తెలిపారు.
మాకు ఈ సినిమా తీయడంలో సహాయం చేసిన నిర్మాత మధు మురళి ధన్యవాదాలు. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశాం. ఈ సినిమాకి సహకరించిన నటీనటులందరికీ థాంక్స్. దేశభక్తిని గుర్తు చేసే సినిమాల్లో ఖడ్గం కూడా ఒకటి కావడం హ్యాపీగా ఉంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











