మహాత్మ ఓ డైనమైట్-కృష్ణవంశీ
ఇప్పటి వరకూ తాను ఏ నటుని కోసము కథని తయారు చేయలేదనీ, తొలిసారిగా తన మిత్రుడు శ్రీకాంత్ వందవ సినిమా కోసం 'మహాత్మ'ని డిజైన్ చేసానన్నారు కృష్ణవంశీ. ఈ సినిమా శ్రీకాంత్ కు తానిస్తున్న కానుక అని ఆయన వ్యఖ్యానించారు. గోల్డెన్ లయన్ ఫిలిమ్స్ పతాకం పై సి.ఆర్.మనోహర్ నిర్మిస్తున్న 'మహాత్మ' చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణన, థియేటర్ ట్రైలర్ ఆవిష్కరణ ఇటీవలే హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. నటుడు రవితేజ ముఖ్యఅథితి గా హాజరయ్యారు.
ఈ సంధర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ "ఇది నా స్నేహితుడు శ్రీకాంత్ కోసం తీసిన సినిమా. ఇందులో శ్రీకాంత్ ది సాధారణ పాత్ర కాదు. ఎవరుపడితే వారు చేయగలిగేది కూడా కాదు. అంత బాగా నటించాడు. నా దృష్టిలో అన్ని రకాలుగా ఈ సినిమా ఒక డైనమైట్" అని వ్యఖ్యానించారు. పరుచూరి బ్రదర్స్ అందించిన సంభాషనలు హైలెట్ గా వస్తున్న ఈ చిత్రం గాంధీ జయంతికి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











