twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ లేడి డైరక్టర్ ప్రేమ కథ...'అలా మొదలైంది'

    By Srikanya
    |

    కృష్ణవంశీ వద్ద అసోశియోట్ గా చేసిన నందినీ రెడ్డి దర్శకురాలుగా పరిచయం అవతోంది. అలా మొదలైంది అనే టైటిల్ తో ఆమె డైరక్ట్ చేస్తున్న చిత్రంలో నాని, నిత్యా మీనన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో స్నేహా ఉల్లాల్, కీర్తి కథకు కీలకమైన మలుపు తెచ్చే పాత్రల్లో చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని రంజిత్ మూవీ పతాకంపై కె.ఎల్.దామోదర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ పై గతంలో చీకటి వెలుగులు, మన ఊరి కథ, లంకె బిందెలు వంటి చిత్రాలు వచ్చాయి. ఇక ఈ చిత్రం గురించి నందిని రెడ్డి మాట్లాడుతూ...ఇది ఓ రొమాంటిక్ డ్రామా జనర్ కి చెందిన చిత్రం. అయితే నేరేషన్ మాత్రం ఓ నావెల్ గా ఉంటుంది. ఇది ఓ ఇద్దరు యంగస్టర్స్ మధ్య జరిగే కథ. ఓఅమ్మాయి,అబ్బాయి ఓ క్రాస్ వద్ద మీటవుతారు. అక్కడ నుండి వారి జీవితాల్లో మార్పులు ఎలా చోటు చేసుకున్నాయి. ఎలా వాళ్ళిద్దరూ తమ గోల్స్ ని నెరవేర్చుకుని ఒకటి అయ్యారు అనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. ఇక ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X