ఫ్లాపుల కృష్ణవంశీకి బంపర్ ఆఫర్.. మల్టీస్టారర్‌ చిత్రంతో రెఢీ.. హీరో, నిర్మాతలు ఎవరంటే..

By Rajababu

Recommended Video

కృష్ణవంశీకి బంపర్ ఆఫర్..! | Filmibeat Telugu

గులాబీ చిత్రంతో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి పరిశ్రమలో దిక్కు తోచని పరిస్థితి. ఒకప్పుడు కృష్ణ వంశీ సినిమా అంటే సినీ వర్గాలకే కాదు.. ప్రేక్షకులకు కూడా ఆసక్తి, ఉత్సాహం పెరిగేది. కానీ ఇటీవల కాలంలో వరుసగా సినిమాలు క్యూ కట్టడంతో ఆయన జోష్ టాలీవుడ్‌లో కనిపించడం లేదు. అయితే తాజాగా ఆయన మల్టీస్టారర్ చిత్రంతో ముందుకు వస్తున్నాడనే వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఆ వివరాలు ఏమిటంటే.

కృష్ణవంశీ అంటే

కృష్ణవంశీ అంటే

సాధారణంగా సూపర్ ఫ్లాప్‌లతో ఉన్న దర్శకుడు కనిపిస్తే హీరోలు ముఖం చాటేసుకునే పరిస్థితి. అయితే కృష్ణవంశీ విషయంలో అలా లేదు పరిస్థితి. ఆయనతో సినిమా చేయడానికి యువ, సీనియర్ హీరో‌లు ముందుకొస్తారని ఇండస్ట్రీలో ఓ టాక్.

నక్షత్రం మూవీతో మళ్లీ చతికిలా..

నక్షత్రం మూవీతో మళ్లీ చతికిలా..

చాలా గ్యాప్ తీసుకొని రూపొందించిన సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్‌తో తీసిన నక్షత్రం కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. విభిన్నమైన కథతో వచ్చిన ఈ చిత్రం కృష్ణవంశీ ప్రతిష్ఠను పెంచలేకపోయింది. దాంతో కృష్ణవంశీ చాప్టర్ క్లోజ్ అనే మాట కూడా వినిపించింది.

మాధవన్‌తో సినిమా

మాధవన్‌తో సినిమా

కానీ ప్రస్తుతం విలక్షణ నటుడు మాధవన్‌తో కృష్ణవంశీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడనే తాజా సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న సవ్యసాచి అనే చిత్రంలో మాధవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరో మల్టీస్టారర్

మరో మల్టీస్టారర్

అయితే మాధవన్‌తో కృష్ణవంశీ రూపొందించబోయే చిత్రం మల్టీస్టారర్ చిత్రమని తెలుస్తున్నది. ఈ చిత్రంలో మాధవన్‌తోపాటు ప్రముఖ తెలుగు హీరో నటించనున్నాడు అనేది తాజా సమాచారం. అయితే ఆ హీరో ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు.

నిర్మాతగా తమ్మారెడ్డి

నిర్మాతగా తమ్మారెడ్డి

ఇక ఈ చిత్రానికి నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజ వ్యవహరించనున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతున్నది. ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

త్వరలోనే అధికారికంగా

త్వరలోనే అధికారికంగా

త్వరలోనే కృష్ణవంశీ తాజా చిత్రం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ చిత్రం కృష్ణవంశీ రూపొందించిన నిన్నే పెళ్లాడుతా చిత్రాలకు ధీటుగా ఉంటుంది అనేది సినీ వర్గాల టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X