సెన్సేషనల్ ప్రాజెక్ట్‌తో కృష్ణవంశీ.. ఆర్జీవీ దారిలో క్రియేటివ్ డైరెక్టర్
వరుస పరాజయాలతో సతమతమవుతున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మరో భారీ ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నట్టు ఓ వార్త సినీ వర్గాల్లో ప్రచారమవుతున్నది. నక్షత్రం సినిమా ఫ్లాప్ తర్వాత కృష్ణవంశీ సుమారు రూ.45 కోట్లతో హారర్ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారనే వార్త క్రేజీగా మారింది. హారర్ సినిమా జోనర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.

ఈసారి తన గురువు రాంగోపాల్ వర్మ దారిని ఎంచుకొన్నట్టు అర్ధమతున్నది. రాత్, భూత్ తరహాలోనే ఓ సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధవుతున్నారనేది టాలీవుడ్ వర్గాల సమచారం. వాస్తవానికి అరుంధతి చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించాల్సిందట. ముందస్తు కమిట్‌మెంట్స్ మూలంగా ఆ సినిమాను వదిలేసుకోవడం జరిగిందట. ప్రస్తుతం పక్కాగా ప్లాన్ చేసిన హిట్ కొట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











