దర్శకుడు కృష్ణవంశీ నిన్న(బుధవారం) సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు . కృష్ణా జిల్లా నందిగామ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ కృష్ణవంశీ స్వల్ప గాయాలతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రథమ చికిత్స అనంతరం ఆయన విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆయన తరుణ్, జెనీలియా జంటగా ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. యాక్సిడెంట్ నుంచి ఆయన క్షేమంగా బయట పడటంతో సినీ రంగం హాయిగా ఊపిరి పీల్చుకుంది.
Story first published: Monday, May 18, 2026, 15:49 [IST]