twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణవంశీ, రవితేజల కందిరీగ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

    By Srikanya
    |

    రవితేజ, కృష్ణవంశీ కాంబినేషన్ లో రానున్న కందిరీగ' చిత్రం జనవరి 9,2010 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తాజా సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లన్నీ బారీ ఎత్తున జరుగుతన్నాయి. ఓ ప్రక్కన స్క్రిప్టు వర్క్ జరుగుతూంటే,మరో ప్రక్క లొకేషన్స్ ఎంపికకు ఓ టీమ్ వెళ్లినట్లు తెలుస్తోంది. హ్యాండీకామ్ తో దర్శకత్వ విభాగం వారు షూటి చేసి ఎంపిక చేసిన లొకేషన్స్ ని కృష్ణవంశీ ఫైనలైజ్ చేస్తారు. అనంతరం నిర్మాత బెల్లంకొండ అనుమతితో ప్రొడక్షన్ మేనేజర్స్ ఆ లొకేషన్స్ ఫర్మిషన్స్ తెచ్చి షూటింగ్ కు ఏర్పాటు చేస్తారు. ఇక ఈ చిత్రంకి సంభందించి పూజా కార్యక్రమాలు కొద్ది నెలల క్రిందట జరిగిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం బెల్లంకొడ నిర్మాతగా రూపొందుతున్న శంభో..శివ..శంభో చిత్రంలో చేస్తున్నారు. సముద్ర ఖని దర్శకత్వంలో తయారవుతున్న ఈ చిత్రం ఆయన దర్శకత్వంలోనే తమిళంలో నాడోడిగల్ గా రూపొంది మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో రవితేజతో పాటు అల్లరి నరేష్,శివబాలాజి మరో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అంతేగాక ప్రియమణి హీరోయిన్ గా చేస్తోంద2010 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ఇక కందిరీగ విషయానికి వస్తే అందులో రవితేజ శ్రీకృష్ణ దేవరాయులు ముని..ముని మనవడుగా కనిపించనున్నారు. ఆ గొప్ప చక్రవర్తి వారసుడు ఈ కాలంలో ఏం చేస్తున్నాడు అన్నదానికి ఓ బర్నింగ్ ఇష్యూని ముడేసి కృష్ణవంశి సినిమా చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. పూర్తి స్దాయి ఎంటర్టైనర్ గా సాగే ఈ కథలో రవితజ రెగ్యులర్ విరుపులకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది. ఈ చిత్రం వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక రవితేజ, కృష్ణవంశి కాంబినేషన్ లోగతంలో 'సింధూరం','ఖడ్గం' వచ్చాయి. ఈ చిత్రం తర్వాత ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న సినిమాకి కూడా రవితేజ కమిట్ అయ్యారు. ఫ్రిబవరి నుంచి రెగ్యులర్ ఘూటింగ్ జరగనుంది. ఆ చిత్రానికి డాన్ శీను అనే టైటిల్ అనుకుంటున్నారు. కోనవెంకట్ స్క్రిప్టు అందిస్తున్న ఈ చిత్రం ద్వారా గోపీచంద్ అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X