'జర్ని' స్టార్ట్ అయ్యింది
{image-krishna vamsi_26052008.jpg telugu.filmibeat.com}'చందమామ' సినిమాతో చాలాకాలం తర్వాత హిట్టు కొట్టిన కృష్ణవంశి తాజాగా మరో ప్రేమ కథా చిత్రానికి శ్రీకారం చుట్టాడు. 'నవ వసంతం,భలే దొంగలు' చిత్రాలతో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బోల్తా కొట్టిన తరుణ్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. అతని సరసన లక్కీ గర్ల్ జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది. శ్రీ కార్తికేయ క్రియేషన్స్ బానర్‌పై సుంకర మధుమురళి నిర్మిస్తున్నఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సైలంట్ గా రాజమండ్రిలో మొదలైంది. ప్రస్తుతం తరుణ్, జూనియర్ ఆర్టిస్టులపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.
రాజమండ్రి, ధవళేశ్వరం పరిసరాల్లో జూన్ 7 వరకు తొలి షెడ్యూల్ జరుగుతుంది. ఈ సినిమాకు 'జర్నీ' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాని దాన్ని కృష్ణవంశీ ధృవీకరించలేదు. ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. కృష్ణవంశీ, విద్యాసాగర్ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. అలాగే తరుణ్ తోనూ ఇదే మొదటిసారి . దాంతో అతను ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడుట. ఎందుకంటే కృష్ణవంశి ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ ,నవదీర్, శివబాలాజీల కెరీర్ లను మళ్ళీ లైమ్ లైట్ లోకి తెచ్చాడనిట. అతని ఆశ నెరవేరాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











