అదే రూటులో కృష్ణవంశి?

ఈ సారి ముగ్గురు హీరోలతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అందులో ఒకడు నవదీప్ అయితే మరొకరు తరుణ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు మరొకరు ఓ తమిళ హీరో అని తెలుస్తోంది. ఇక బి.వి.యస్.ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని శశిరేఖా పరిణయం రిలీజ్ అయిన వెంటనే ప్రారంభించే యోచనలో ఉన్నారు. అలాగే ఈ చిత్రం కూడా కామెడీతో కూడిన ఎంటర్ టైనర్ గా ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అవి అయితేనే బాగా వర్కవుట్ అవుతాయని పెద్ద బడ్జెట్ కూడా పెట్టక్కర్లేదని కృష్ణవంశి ఆలోచన. అంతేగాక పెద్ద హీరోల సినిమాలకయితే తన ముద్ర ప్రత్యేకంగా కనపడదని,ఇండిడ్యువాలటీ దెబ్బతింటుందని అటువంటి అవకాశాలు వచ్చేలా ఉన్నా ఆసక్తి చూపటం లేదంటున్నారు.


Click it and Unblock the Notifications











