ప్రస్తతం ఆంజనేయులు షూటింగ్ లో బిజీగా ఉన్న రవితేజ తర్వాత కృష్ణవంశితో చేయనున్నట్లు సమాచారం. అలాగే కృష్ణవంశి కూడా మహాత్మ అనంతరం కమర్షియల్ గా బ్రేక్ ఇచ్చే చిత్రం చేయాలని ఆసక్తిగా ఉన్నారు. అసలు ఇంతకుముందు రెండు మూడు సార్లు కృష్ణవంశితో రవితేజ చిత్రం చేయాలని ప్లాన్ చేసారు. కథ కుదరక ఒకసారి, డేట్స్ కుదరక మరో సారి, వేరే కమిట్ మెంట్స్ తో మరోసారి వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ఈ సారి కన్ఫర్మ్ గా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆంజనేయులు చిత్రాన్ని యువత దర్శకుడు పరుశరామ్ డైరక్ట్ చేస్తున్నాడు. నయనతార..ఈ చిత్రంలో రవితేజకి జోడిగా చేస్తోంది.