కృష్ణవంశీ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించే చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం సంస్థ కార్యాలయంలో జరిగాయి. చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై మొదటివారంలో ప్రారంభమవుతుందని, హీరోయిన్, ఇతర వివరాలు తర్వాత వెల్లడిస్తామని నిర్మాత చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించే కమర్షియల్ విలువలతో రూపొందే ఈ చిత్రానికి సహ నిర్మాత ఉప్పలపాటి రవి.
Story first published: Friday, June 5, 2009, 14:51 [IST]