చందమామ తర్వాత కృష్ణవంశి 'రుద్రాక్ష' తో ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆయన పూర్తి విభిన్నమైన థ్రిల్లర్ లా తెరకెక్కించాలని అనుకుంటున్నారట. కొత్తవారితో థ్రిల్లర్లు రూపొందించే సాంప్రదాయనికి స్వస్తి పలికి పేరు,క్రేజ్ ఉన్నవాళ్ళతో లావిష్ గా రూపొందించి హిట్ కొట్టాలని ఆలోచిస్తున్నారట. ఇందులో వచ్చే ప్రథాన పాత్రల కోసం ఉపేంద్ర,శ్రియ లని సంప్రదించారని తెలుస్తోంది. ఇక ఇలాంటి సినిమాలకు రీరికార్డింగ్ ప్రాణం.అందుకోసమే ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్ .రహమాన్ శిష్యడు,మేనల్లుడు అయిన ఇరవై యోళ్ళ జి.వి.ప్రకాష్ అనే కుర్రాడుని పరిచయం చేస్తున్నారట. ఇక పాపులర్ కెమెరామెన్ ఆర్.డి.రాజ్ శేఖర్ ఈ సినిమాకి పని చేస్తాడట. సుంకర మథు మురళి ఈ సినిమాని కార్తికేయ బ్యానర్ పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నాడు. ఇవన్నీ ఇలా ఉంటే ఫిల్మ్ నగర్ వాసులు రుద్రాక్ష సినిమా కథ అతీత శక్తుల చుట్టూ తిరుగుతుందని ..కాదని పందేలు వేసుకుంటున్నారు.