Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రుద్రమదేవి: సెన్స్‌లెస్, మైండ్‌లెస్ అంటూ కృష్ణ వంశీ!
హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చారిత్రాత్మక మూవీ ‘రుద్రమదేవి' మేకింగ్ వీడియో ఇటీవల విడుదలైంది. ఈ సినిమా కోసం దర్శకుడు, టెక్నీషియన్స్, తారాగణం ఎంత కష్టపడ్డారో ఈ వీడియో స్పష్టం చేస్తోంది. దీన్ని చూసిన మరో దర్శకుడు కృష్ణ వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పొగడ్తల వర్షం కురిపించారు.
తన ఫేస్ బుక్ పేజీలో కృష్ణ వంశీ ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ.....‘ఇప్పుడు గుణ సార్ డ్రీమ్ ప్రాజెక్టు రుద్రమదేవి మేకింగ్ వీడియో చూసాను. సెన్స్ లెస్, మీనింగ్ లెస్, మైండ్ లెస్, అసభ్యత, అశ్లీలతతో కూడిన సినిమాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో....ఒక డైరెక్టర్ మాత్రం విలువలతో కూడిన, చరిత్రను గుర్తు చేసే సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నారు' అంటూ వ్యాఖ్యానించారు.
అంతే కాదు...‘రుద్రమదేవిగా అనుష్క లుక్, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది, డైనమిక్‌గా' అంటూ వ్యాఖ్యానించింది. సినిమా విడుదల ముందు ఈ మేకింగ్ వీడియో విడుదల చేయడం మంచి ఫలితాలను ఇస్తోంది. అనుష్క పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ వీడియోతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
‘రుద్రమదేవి' చిత్రాన్ని గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. అనుష్క శెట్టి, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.