twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రుద్రమదేవి: సెన్స్‌లెస్, మైండ్‌లెస్ అంటూ కృష్ణ వంశీ!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చారిత్రాత్మక మూవీ ‘రుద్రమదేవి' మేకింగ్ వీడియో ఇటీవల విడుదలైంది. ఈ సినిమా కోసం దర్శకుడు, టెక్నీషియన్స్, తారాగణం ఎంత కష్టపడ్డారో ఈ వీడియో స్పష్టం చేస్తోంది. దీన్ని చూసిన మరో దర్శకుడు కృష్ణ వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పొగడ్తల వర్షం కురిపించారు.

    తన ఫేస్ బుక్ పేజీలో కృష్ణ వంశీ ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ.....‘ఇప్పుడు గుణ సార్ డ్రీమ్ ప్రాజెక్టు రుద్రమదేవి మేకింగ్ వీడియో చూసాను. సెన్స్ లెస్, మీనింగ్ లెస్, మైండ్ లెస్, అసభ్యత, అశ్లీలతతో కూడిన సినిమాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో....ఒక డైరెక్టర్ మాత్రం విలువలతో కూడిన, చరిత్రను గుర్తు చేసే సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నారు' అంటూ వ్యాఖ్యానించారు.

     Krishna Vamsi Salutes Gunasekhar for Rudhramadhevi

    అంతే కాదు...‘రుద్రమదేవిగా అనుష్క లుక్, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది, డైనమిక్‌గా' అంటూ వ్యాఖ్యానించింది. సినిమా విడుదల ముందు ఈ మేకింగ్ వీడియో విడుదల చేయడం మంచి ఫలితాలను ఇస్తోంది. అనుష్క పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ వీడియోతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

    ‘రుద్రమదేవి' చిత్రాన్ని గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. అనుష్క శెట్టి, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

    English summary
    Krishna Vamsi, the creative director of Tollywood has praised Gunasekhar the filmmaker of Rudhramadevi, after watching the ‘Rudhrma Devi- Making'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X