రెజీనాకు ...డైరక్టర్ కృష్ణవంశీ క్షమాపణ చెప్పి, బాధపడ్డారు
డైరక్టర్ కృష్ణవంశీ తన హీరోయిన్ రెజీనాకు సారి చెప్పి బాధపడ్డారు.
హైదరాబాద్: సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరో హీరోయిన్లకు చిత్రం టీం బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పడం, ఇంకా అవకాసం ఉంటే సెట్ లోనే కేకు కోయించి, విషెష్ తెలియచేయటం ఇండస్ట్రీలో ఆనవాయితీగా వస్తోంది. అయితే, డిసెంబర్ 13న రెజీనా పుట్టిన రోజుని నక్షత్రం సినిమా టీమ్ మర్చిపోయింది.
దీంతో రెండురోజుల తర్వాత జరిగిన తప్పిదాన్ని గుర్తించాడు డైరెక్టర్ కృష్ణ వంశీ. అంతే, క్షమించు..క్షమించు రెజీనా అంటూ ప్రాధేయపడ్డాడు వంశీ. 2017 ఏడాది నీది కాబోతోందని గ్రీటింగ్స్ ఇచ్చాడు. అంతేకాదే, రెజీనాకు శుభాకాంక్షలు చెబుతూ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశాడు.
శివ మనసులో శ్రుతి, రొటీన్ లవ్‌స్టోరీ, కొత్తజంట, పవర్, పిల్లా.. నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్‌సేల్, జ్యో అచ్యుతానంద తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ రెజీనా. ప్రస్తుతం ఆమె కృష్ణ వంశీ దర్శకత్వంలో నక్షత్రం చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఇది పక్కనపెడితే.. రెజీనా ఇటీవల పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా నక్షత్రం చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు చెప్పలేదట. దీనికి క్షమాపణ చెబుతూ తాజాగా కృష్ణ వంశీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు.
'రెజీనాకు శుభాకాంక్షలు చెప్పడంలో ఆలస్యమైనందుకు క్షమించండి. కానీ అసలు చెప్పకపోవడం కన్నా ఆలస్యంగా చెప్పడం మంచిది కదా. రెజీనా.. ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలని, విజయం చేకూరాలని కోరుకుంటున్నాం. 2017 నీది కాబోతోంది. విష్ యు వెరీ హ్యాపీ బర్త్‌డే. మరోసారి క్షమాపణ కోరుతున్నాం. మేము నీ పుట్టినరోజు గురించి సమాచారం ఇవ్వలేదు' అంటూ బాధపడ్డారు. ఈ సందర్భంగా నక్షత్రం సినిమాకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.


Click it and Unblock the Notifications











