రామ్ చరణ్ కంటే మహేష్ బాబుతో మూవీ చేయడం చాలా కష్టం.. సీనియర్ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి ప్రపంచ స్థాయిలో అపారమైన ఆదరణ అందుకున్న హీరోలు కూడా కొందరు ఉన్నారు. మరి ఈ లిస్ట్ లో బాలీవుడ్ నుంచి కొందరు ఉంటే ఆ తర్వాత మన తెలుగు సినిమా నుంచి కూడా కొందరు ఉన్నారు. కాగా ఈ కొందరిలో డామ్న్ ష్యూర్ గా మెగా యువ హీరో గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉంటాడని చెప్పాలి.
తన గత సక్సెస్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషనల్ రీచ్ ని అందుకోవడంతో రామ్ చరణ్ కి కూడా ఈ సినిమాతో భారీ ఫేమ్ దక్కింది. ఏకంగా "అవతార్" లాంటి సినిమాని తీసిన దర్శకుడే జేమ్స్ కామెరాన్ రామ్ చరణ్ రోల్ ని ప్రశంసించారు. ఇంకా ఎన్నెన్నో ఫీట్ లు గ్లోబల్ వైడ్ గా రామ్ చరణ్ అందుకున్నాడు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ రీచ్ ని మాత్రం మన టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు పరిగణలోకి తీసుకోలేదనే అనిపిస్తుంది.

కాగా ఆ దర్శకుడు ఎవరో కూడా కాదు మన తెలుగులో ఎన్నో క్లాసిక్ హిట్స్ చంద్రలేఖ, మురారి, ఖడ్గం, రాఖీ లాంటి సినిమాలు సినిమాలు అలాగే రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాని చేసిన దర్శకుడు కృష్ణ వంశీ కోసం ఇప్పుడు చెప్పుకునేది. కాగా తాను ఇటీవల సోషల్ మీడియాలో అందరి హీరోస్ ఫాలోవర్స్ తో ముచ్చటించారు. ఈ క్రమంలో రామ్ చరణ్ తో మరో సినిమా ఎపుడు అనే మాటకి బదులిస్తూ చరణ్ కోసం అదిరిపోయే ఐడియా నా దగ్గర ఉంది, క్రేజీ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసాను కానీ ఇప్పుడు రామ్ చరణ్ తనకి ఓకే చెప్పాల్సి ఉందని అంతా చరణ్ చేతుల్లోనే ఉందని తేల్చేసారు.
ఇది బాగానే ఉంది కానీ ఇక్కడ మరో హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమా ఎప్పుడు అంటే మహేష్ బాబు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ తనతో సినిమా చేయడం ఇక కష్టమని రిప్లై ఇచ్చారు. మరి ఈ వ్యత్యాసంతో ఆల్రెడీ గ్లోబల్ ఫేమ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ని ఇంకా గ్లోబల్ మార్కెట్ లోకి వెళ్లని మహేష్ బాబు లా కాకుండా ట్రీట్ చెయ్యడం ఆశ్చర్యంగా ఉందని చెప్పాలి.

దీనితో ఈ దర్శకుడు మాత్రం ఇంకా రామ్ చరణ్ ని గ్లోబల్ హీరోగానో లేక ఇంటెర్నేషల్ స్టార్ గానో పరిగణించడం లేదనే అనుకోవాలా? ఇదిలా ఉంటే రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఖచ్చితంగా కృష్ణ వంశీతో మరో సినిమా చేయాలని సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు. ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే పెద్ద హిట్టేమీ కాలేదు.
సో ఓ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ కోసం వారు ఎదురు చూస్తున్నారు. మరి రామ్ చరణ్ కోసం సిద్ధం చేసిన ఆ స్పెషల్ సబ్జెక్ట్ ఏమిటో చరణ్ వరకు అది వెళుతుందో లేదో అనేది చూడాలి. కాగా ఇప్పుడు రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో "గేమ్ ఛేంజర్" సినిమాని పూర్తి చేయగా నెక్స్ట్ వరుసగా గురు శిష్యులు బుచ్చిబాబు సాన అలాగే సుకుమార్ లతో భారీ చిత్రాలు రామ్ చరణ్ చేయనున్నాడు.


Click it and Unblock the Notifications











