కృష్ణవంశీ 'అన్నం' కొసం టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ఒకప్పుడు ప్రయోగాత్మకమైన కథలతో అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకున్న దర్శకుడు కృష్ణవంశీ చాలా కాలం తరువాత మరో ప్రయోగంతో సిద్ధమవుతున్నాడు. మొదటి సినిమా గులాబీనుంచి ప్రతి మూవీ కూడా ఒక యూనిక్ స్టైల్ తో వచ్చినవే. ఫ్యామిలీ కథలు, సామాజిక అంశాలపై సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నారు. అయితే నెక్స్ట్ ఆయన మరిన్ని డిఫరెంట్ సినిమాలతో రాబోతున్నారు.
అయితే చందమామ సినిమా అనంతరం మళ్ళీ కృష్ణవంశీ సరైన బాక్సాఫీస్ హిట్ అందుకోలేదు. వరుసగా ఆరు సినిమాలు ప్లాప్ అయ్యాయి. నెక్స్ట్ రంగమార్తాండ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక రంగమార్తాండ విడుదల కాకముందే మరొక సినిమాపై క్లారిటీ ఇచ్చేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నట్లు ఇటీవల ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండియన్ టాప్ టెక్నీషియన్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్. ఇటీవల రెహమాన్ తో చర్చలు జరిపినట్లు టాక్ కూడా వస్తోంది. గతంలో కృష్ణవంశీ రైతు అనే సినిమాను చేయాలని బాలకృష్ణ ప్లాన్ వేసినప్పటికి వర్కౌట్ కాలేదు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ను అన్నం అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











