twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రిన్స్ మహేష్ సినిమా విడుదల డెషిషన్స్‌పై సూపర్ స్టార్ కృష్ణ అసంతృప్తి

    By Nageswara Rao
    |

    సూపర్ స్టార్ అనే పదానికి సరిక్రొత్త నిర్వచనాన్ని చెప్పిన వ్యక్తి కృష్ణ. టాలీవుడ్‌లో కృష్ణ సూపర్ స్టార్‌ అవ్వడానికి కారణం తన ప్రోడ్యూసర్స్, డైరెక్టర్స్, కో-ఆర్టిస్ట్‌లతో ఆయనకున్నటువంటి సంబంధమే ఆయనని ఇప్పటికి కూడా టాలీవుడ్ ఓ లెజండరీగా గుర్తిస్తుంది. 1965 నుండి 2002 వరకు వరుసగా 37 సంవత్సరాలు పాటు సంవత్సరానికి ఒక్కో సినిమా చొప్పున హీరగా సినిమాలు తీసినటువంటి ఘనత మన ఘట్టమనేని శివరామకృష్ణదే కావడం విశేషం. అంతేకాకుండా యావత్ భారతదేశంలోనే ఇలాంటి అరుదైన రికార్డుని నమోదు చేసినటువంటి హీరో మన సూపర్ స్టార్ కృష్ణ కావడం విశేషం. ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటూన్నామంటే ఇప్పటితరం హీరోలు అయినటువంటి కుర్రవాళ్శు సంవత్సరానికి ఒక్క సినిమా కూడా తీయలేకపోతున్నారని చెప్పడానికే..

    అలా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి మరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ కూడా వాళ్శ నాన్నగారి లాగా సినిమాలు తీయలేక పోతున్నారు. దీంతో సూపర్ స్టార్ సినిమాలకోసం అభిమానులు ఎదురుచూసి చూసి కళ్శు కాయలు కాస్తున్నాయంట. దాంతో అభిమానులకు ప్రిన్స్ మహేష్ ఖలేజా ప్లాప్ తో రియలైజ్ అయిపోయి ఇక ఇప్పటినుంచి సంవత్సరానికి రెండు విడుదలయ్యేటట్లు చూసుకుంటాను అంటూ మాట ఇవ్వడం జరిగింది.

    ప్రస్తుతం మహేష్ నటిస్తున్న దూకుడు చిత్రం ఈ వేసవికి విడుదల కావాల్సి వుంది. కానీ సినీ పరిశ్రమ సమ్మెతో ఇంకా దూకుడు వర్క్ చాలా పెండింగ్ లో వుంది. ఎంత త్వరగా షూటింగ్ పూర్తి చేసినా ఈ సమ్మర్ కి చిత్రాన్ని విడుదల చేయలేమని దర్శకుడు శ్రీను వైట్ల చేతులెత్తేసాడు. ఈ చిత్రం పూర్తయితే కానీ మహేష్ మరో చిత్రం ప్రారంభం కాదు. ఈ సంవత్సరం మహేష్ నటించిన దూకుడు మాత్రమే విడుదలవుతుంది. దూకుడు సినిమాకి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈసినిమాలో ప్రిన్స్ మహేష్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు.

    English summary
    Ghattamaneni Krishna is the true definition of Super Star. The comfort levels of Krishna with producers, directors, co-artists and Fans were one of the basic reasons why he remained the best hero in Tollywood books. Super Star is the only hero in the history of Telugu cinema to have at least one movie in the lead role every year for 37 consecutive years all the way from 1965 to 2002, a rare feat which can’t be achieved by any hero in world.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X