సింగనమల రమేష్ కేసు... కోర్టుకు కృష్ణ,విజయనిర్మల
ఆ చెక్ లు చెల్లకపోవడంతో వారిద్దరూ రమేష్‌పై విడివిడిగా కోర్టులో కేసులువేశారు. ప్రస్తుతం ఆ కేసులపై ఇక్కడి హస్తినాపురంలోని మూడో ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కృష్ణ, విజయనిర్మల మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో మీడియా వారితో మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు.
సింగనమల రమేష్ నిర్మాతగా గతంలో మహేష్ హీరోగా ఖలేజా చిత్రం వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్లాప్ చిత్రంగా భాక్సాఫీస్ వద్ద నమోదైంది. అదుపు తప్పిన నిర్మాణ వ్యయం ఈ చిత్రం పరాజయానికి ప్రధాన కారణంగా అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇక నిర్మాత సింగనమల రమేష్ తమను ముంచేసాడంటూ దాదాపు యాభై మంది దాకా ఫైనాన్సియర్లు ఏడాది క్రిందటే మీడియాకి ఎక్కారు. జైలులో ఉన్న సినీ నిర్మాత శింగనమల రమేష్ కు ప్రొద్దుటూరు చెందిన ఏభై మంది వ్యాపారులు అప్పులిచ్చారు.అనంతపురం జిల్లాకు చెందిన రమేష్ కు ప్రొద్దుటూరులో కొందరు బంధువులు ఉన్నారు.వారిద్వారా కాని సుమారు ఏభైమంది ఏభై కోట్ల రూపాయల వరకు అప్పులిచ్చారు.అయితే ఊహించని విధంగా ఫ్యాక్షనిస్టు మద్దెలచెరువు సూరి హత్య కేసు నిందితుడు అయిన భానుతో సంబంధాలు పెట్టుకుని ఈ అప్పులు ఇచ్చినవారందరిని బెదిరించడం ఆరంభించాడు.అలాగే తమ అప్పు తీర్చమని ఎవరైనా అడిగితే భాను పేరు చెప్పి బెదిరించి వారి నోరు మూయించేవాడు.
ప్రొద్దుటూరులోని ప్రముఖ ఫైనాన్షియర్స్ అయిన ఎమ్.చంద్రశేఖర్, విఎస్వి సత్యనారాయణ, ఎ.వెంకటసబ్బయ్య, ఎసి సుబ్బారావు, ప్రవీణ్ మొదలైన వారంతా రమేష్ కు కోటి పాతిక లక్షల రూపాయల రుణం ఇచ్చామని చెప్తున్నారు. తిరిగి చెల్లించమంటే నష్టాలలో ఉన్నానంటూ చెప్పి తప్పించుకునేవాడు. గట్టిగా అడిగితే తనకు మద్దెలచెరువు సూరి, భాను కిరణ్ లతో ఉన్నసంబంధాలు చెప్పి భయపెట్టేవాడు.అయితే సూరి హత్య కు గురి అయిన తర్వాత మాత్రమే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి.అయితే ఇప్పుడు ఈ వ్యాపరులకు తమ డబ్బు తమచేతికి వస్తుందా అనే నమ్మకం మాత్రం పోయింది.కొమురం పులి,ఖలేజా చిత్రాల నిమిత్తం ఆ ఫైనాన్సియర్స్ అప్పులు ఇచ్చారు.


Click it and Unblock the Notifications












