ఎన్‌టిఆర్- కథానాయకుడు వీక్షించిన సూపర్‌స్టార్ కృష్ణ, బాలయ్యపై ప్రశంసలు!
ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్‌టిఆర్- కథానాయకుడు చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ రూపొందించిన ఈ బయోపిక్ చాలా బావుంది. సినిమా చూసినట్లు కాకుండా ఒక లైఫ్ చూసినట్లు అనిపించింది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ బాగా సూటయ్యారు. ఆయన వేసిన అన్నీ గెటప్స్ బావున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది.' అన్నారు.
విజయ నిర్మల మాట్లాడుతూ - నాకు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఎన్టీఆర్‌గారితో కలిసి పాండు రంగ మహత్యం చేశాను. ఆ సినిమాలో కృష్ణుడిగా నటించాను. బయోపిక్ చూస్తుంటే ఎన్టీఆర్‌గారిని చూసిన భావన కలిగేలా బాలకృష్ణ నటించారు. సినిమా చాలా బావుంది అన్నారు.

నరేష్ విజయకృష్ణ మాట్లాడుతూ - ఎన్.టి.ఆర్ బయోపిక్ అనౌన్స్ అయినప్పుడు ఇందులో ఓ అవకాశం వస్తుందా! అని ఆసక్తిగా ఎదురుచూశాను. మా అమ్మగారి తొలి సినిమా ఆయనతోనే నటించారు. ఈ బయోపిక్‌లో వేషం వేయాలని నన్ను అడిగినప్పుడు చాలా సంతోషం వేసింది. అది కూడా బి.ఎ.సుబ్బారావుగారి వేషం. ఆ సన్నివేశాలను చేస్తున్నప్పుడు థ్రిల్ ఫీలయ్యాను' అన్నారు.
దర్శకుడు క్రిష్‌గారు ఈ సినిమాతో గ్రేట్ డైరెక్టర్ నుండి లెజెండరీ డైరెక్టర్ అయ్యారు. బయోపిక్‌ను తీయడం అంత సులభం కాదు. కానీ క్రిష్ ప్లానింగ్‌తో అనుకున్న సమయంలో పూర్తి చేశారు. ఈ సినిమాతో బాలకృష్ణ మహానటుడిగా అవతరించారని నరేష్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











