మహేష్ సినిమాకు తొలిసారిగా కృష్ణ డుమ్మా..!
హైదరాబాద్ : కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి...పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగిన హీరో మహేష్ బాబు. బాక్సీఫీసు వద్ద తన సత్తాచాటి టాలీవుడ్ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు విజయం వెనక కృష్ణ సపోర్టు ఉందనేది కాదనలేనిసత్యం.
తన తనయుడు మహేష్ బాబు తొలి సినిమా నుండి నేటి వరకు ప్రతి సినిమా ఆడియో వేడుకకు క్రమం తప్పకుండా కృష్ణ హాజరవుతూ వచ్చారు. అయితే కృష్ణ తొలిసారిగా తన తనయుడు మహేష్ బాబు నటిస్తున్న సినిమా ఆడియో వేడుకకు డుమ్మా కొడుతున్నారు. ఈ నెల 16న జరుగనున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఆడియో వేడుకకు కృష్ణ హాజరు కావడం లేదు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో అందుబాటులో లేరని, వైజాగ్ లో ఉన్నారని, అందుకే రావడం లేదని తెలుస్తోంది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేస్తోంది.
మహేష్ బాబు, వెంకటేష్ ల సినీ కేరీర్‌లోనే ఈచిత్రం విభిన్న చిత్రంగా నిలవనుందని, ఈచిత్రం విజయవంతమైతే తెలుగులో మల్టీస్టారర్ చిత్రాల జోరందుకోనుంది. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











