»   » ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీకి అవసరం: మహేష్ బాబు (నాని మూవీ ఆడియో వేడుక)

ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీకి అవసరం: మహేష్ బాబు (నాని మూవీ ఆడియో వేడుక)

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం7గా రూపొందుతోన్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ'. రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర నిర్మాతలు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలు విడుదల చేసారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ...మా 14రీల్స్ సంస్థ వారు తీస్తున్న సినిమా ఇది. ఈ ఫంక్షన్ కు రావడం ఆనందంగా ఉంది. డెడికేషన్ ఉన్న నిర్మాతలు. వారి లాంటి నిర్మాతలను నేను చూడలేదు. అలాంటి నిర్మాతలు మనకు అవసరం. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే హను లాంటి టాలెంటెడ్ వ్యక్తులు ఇండస్ట్రీకి అవసరం. నాని చేసిన ‘భలే భలే మగాడివోయ్' చూసాను. ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చేసాడు. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలి. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.


నాని మాట్లాడుతూ...‘ఈ సినిమా మా అందరికీ చాలా స్పెషల్. హను చేసిన అందాల రాక్షసి చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే షాకవుతారు. తను ఒక సినిమా పిచ్చోడు. ఈ సినిమా జర్నీలో నాకు ఒక బ్రదర్ లా మారాడు. నిర్మాతలు నిర్మాతల్లా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్లలా పని చేసారు. ఈ సినిమాలో నటించిన చిన్నారులే మాకు ఎనర్జీ. మహేష్ గారికి థాంక్స్. ఈ సినిమాకు సపోర్టు చేసి అందరికీ థాంక్స్' అన్నారు.


నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ... గతంలో మేం చేసిన కొన్ని తప్పుల వల్ల 14 రీల్స్ ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే మాతో చేసిన నటులు, టెక్నీషియన్స్ మా సంస్థ బావుండాలని కోరుకున్నారు. అందరూ మాకు సపోర్టుగా నిలించారు. అందరి ఆశీస్సులతో ఇపుడు గర్వంగా నిలబడ్డాం అన్నారు.


స్లైడ్ షోలో ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు, మరిన్ని వివరాలు...


మహేష్ బాబు
  

మహేష్ బాబు

మహేష్ బాబు చేతుల మీదుగా ఆడియో ఆవిష్కరణ జరిరిగింది.


చిన్నారులు
  

చిన్నారులు

ఈ సినిమాలో చేసిన చిన్నారులు నాకు బాగా నచ్చారని మహేష్ బాబు అన్నారు.


పెద్ద హిట్ కావాలి
  

పెద్ద హిట్ కావాలి

ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలి. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు మహేష్


మహేష్, నాని
  

మహేష్, నాని

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఆడియో వేడుకలో మహేష్ బాబు, నాని.


అల్లరి నరేష్
  

అల్లరి నరేష్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' టీంతో అల్లరి నరేష్


 


 


Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu