Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ విషయంలో పెదనాన్నతోనే పోటీనా.. కృష్ణంరాజు, ప్రభాస్ స్టిల్ వైరల్
రెబల్ స్టార్ కృష్ణంరాజు స్టైల్, మ్యానరిజం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఠీవీ, ఆ రాజసం కృష్ణంరాజులో తప్పా మరేతర నటుల్లోనూ కనిపించదు. ఆయన స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ కూడా ఓ ల్యాండ్ మార్క్. ఆయన యాక్టింగ్ కూడా ఓ బ్రాండ్. అలాంటి కృష్ణం రాజు ప్రభాస్ రాధేశ్యామ్ సెట్లో సందడి చేశాడు. ఆ మధ్య షూటింగ్లో దిగిన ఓ స్టిల్‌ను ఇప్పుడు షేర్ చేశాడు. ఇందులో ప్రభాస్, కృష్ణం రాజు ఇద్దరూ కూడా ఒకే తీరుగా పోజులు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
ప్రేమికుల దినోత్సవం..
రాధేశ్యామ్ సినిమా నుంచి రాకరాక ఓ అప్డేట్ వచ్చింది. ప్రేమ కథా చిత్రంగా రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగానే రిలీజ్ చేశారు. రాధేశ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. పూజా హెగ్డే, ప్రభాస్ మధ్య కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అవుతున్నారు.
అలా వైరల్..
రాధేశ్యామ్ ఫస్ట్ గ్లింప్స్‌లో ప్రభాస్ ధరించిన క్యాస్టూమ్స్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభాస్ ధరించిన క్యాస్టూమ్స్ విలువ దాదాపు ఆరు కోట్లు ఉంటుందనే టాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ ఫస్ట్ గ్లింప్స్‌కు మాత్రం అనుకున్నంత రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది.
కృష్ణంరాజు కూడా..
ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో కృష్ణంరాజు కూడా ఓ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. పరమహంస అనే పాత్రలో కృష్ణంరాజు మెరవబోతోన్నట్టు ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే తాజాగా కృష్ణం రాజు షేర్ చేసిన ఫోటోతో అది నిజమని ఇట్టే తెలుస్తోంది.
ఇటలీలో అలా..
రాధేశ్యామ్ చిత్రయూనిట్ ఇటలీలో మూవీని షూట్ చేసినట్టు తెలిసిందే. రాధేశ్యామ్ యూనిట్‌తో పాటు అక్కడికి కృష్ణంరాజు వెళ్లాడు. అయితే తాజాగా కృష్ణంరాజు ఓ ఫోటోను షేర్ చేశాడు. ప్రభాస్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ రాధేశ్యామ్ గురించి చెప్పుకొచ్చాడు.
70లో ఉన్న ప్రభాస్..
70వ దశకం నాటి రోజులను ప్రభాస్‌తో కలిసి గుర్తుకు చేసుకుంటున్నాను.. రాధేశ్యామ్‌తో కలిసి మళ్లీ నాటి రోజుల్లోకి వెళ్దాం.. రాధేశ్యామ్ జూలై 30న రాబోతోందంటూ చెప్పుకొచ్చాడు.అయితే ప్రభాస్ తన పెదనాన్నతో పోటీపడుతూ స్టైలీష్‌గా పోజు పెట్టేందుకు ప్రయత్నించాడు.