twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ విషయంలో పెదనాన్నతోనే పోటీనా.. కృష్ణంరాజు, ప్రభాస్ స్టిల్ వైరల్

    |

    రెబల్ స్టార్ కృష్ణంరాజు స్టైల్, మ్యానరిజం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఠీవీ, ఆ రాజసం కృష్ణంరాజులో తప్పా మరేతర నటుల్లోనూ కనిపించదు. ఆయన స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ కూడా ఓ ల్యాండ్ మార్క్. ఆయన యాక్టింగ్ కూడా ఓ బ్రాండ్. అలాంటి కృష్ణం రాజు ప్రభాస్ రాధేశ్యామ్ సెట్‌లో సందడి చేశాడు. ఆ మధ్య షూటింగ్‌లో దిగిన ఓ స్టిల్‌ను ఇప్పుడు షేర్ చేశాడు. ఇందులో ప్రభాస్, కృష్ణం రాజు ఇద్దరూ కూడా ఒకే తీరుగా పోజులు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.

     ప్రేమికుల దినోత్సవం..

    ప్రేమికుల దినోత్సవం..

    రాధేశ్యామ్ సినిమా నుంచి రాకరాక ఓ అప్డేట్ వచ్చింది. ప్రేమ కథా చిత్రంగా రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగానే రిలీజ్ చేశారు. రాధేశ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. పూజా హెగ్డే, ప్రభాస్ మధ్య కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అవుతున్నారు.

     అలా వైరల్..

    అలా వైరల్..

    రాధేశ్యామ్ ఫస్ట్ గ్లింప్స్‌లో ప్రభాస్ ధరించిన క్యాస్టూమ్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభాస్ ధరించిన క్యాస్టూమ్స్ విలువ దాదాపు ఆరు కోట్లు ఉంటుందనే టాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ ఫస్ట్ గ్లింప్స్‌కు మాత్రం అనుకున్నంత రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది.

    కృష్ణంరాజు కూడా..

    కృష్ణంరాజు కూడా..

    ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో కృష్ణంరాజు కూడా ఓ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. పరమహంస అనే పాత్రలో కృష్ణంరాజు మెరవబోతోన్నట్టు ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే తాజాగా కృష్ణం రాజు షేర్ చేసిన ఫోటోతో అది నిజమని ఇట్టే తెలుస్తోంది.

     ఇటలీలో అలా..

    ఇటలీలో అలా..

    రాధేశ్యామ్ చిత్రయూనిట్ ఇటలీలో మూవీని షూట్ చేసినట్టు తెలిసిందే. రాధేశ్యామ్ యూనిట్‌తో పాటు అక్కడికి కృష్ణంరాజు వెళ్లాడు. అయితే తాజాగా కృష్ణంరాజు ఓ ఫోటోను షేర్ చేశాడు. ప్రభాస్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ రాధేశ్యామ్ గురించి చెప్పుకొచ్చాడు.

    70లో ఉన్న ప్రభాస్..

    70లో ఉన్న ప్రభాస్..

    70వ దశకం నాటి రోజులను ప్రభాస్‌తో కలిసి గుర్తుకు చేసుకుంటున్నాను.. రాధేశ్యామ్‌తో కలిసి మళ్లీ నాటి రోజుల్లోకి వెళ్దాం.. రాధేశ్యామ్ జూలై 30న రాబోతోందంటూ చెప్పుకొచ్చాడు.అయితే ప్రభాస్ తన పెదనాన్నతో పోటీపడుతూ స్టైలీష్‌గా పోజు పెట్టేందుకు ప్రయత్నించాడు.

    English summary
    Krishnam Raju And Prabhas At Radhe shyam Shoot
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X