ప్రియమణి చండీ: అశోక్ గజపతి రాజుగా కృష్ణంరాజు
గతంలో కృష్ణరాజు చేసిన బొబ్బిలి బ్రహ్మన్న, పల్నాటి పౌరుషం, తాండ్ర పాపారాయుడు రేంజిలో అశోక్ గజపతి రాజు పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ సినిమాకు వి.సముద్ర దర్శకుడు. జి.జగన్నాథనాయుడు సమర్పణలో ఒమిక్స్ క్రియేషన్స్ పతాకంపై డాజి.శ్రీనుబాబు నిర్మిస్తున్నారు.
ఒక సామాన్యురాలు మంత్రిగా ఎలా ఎదిగింది? అనేది ఈచిత్ర కథాంశం 3 విభిన్న కోణాలు, గెటప్‌లు నా ప్రియమణి పాత్రలో కనిపిస్తాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్‌ఇజడ్) నేపథ్యంలోని కథాంశమిది. మూడు షెడ్యూల్స్‌లో టాకీ పార్టు పూర్తయింది. ఈచిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణకు రెడీ అవుతోంది.
ఆశిష్ విద్యార్థి, సుప్రీత్, రంగనాథ్, నాగేంద్రబాబు, వినోద్‌కుమార్, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్, అలీ, తెలంగాణ శకుంతల తదితరులు నటిస్తున్నారు. కెమెరా: వాసు, సంగీతం: ఎస్.ఆర్.శంకర్, చిన్నా, ఎడిటింగ్: నందమూరి హరి, కళ: వెంకటేశ్వర్లు మల్లెల, కథ-మాటలు: కరణం పి.బాబ్జీ, సహనిర్మాత: సత్య ముమ్మిడి, కథనం-దర్శకత్వం: వి.సముద్ర.


Click it and Unblock the Notifications












