ప్రభాస్ 'రెబెల్'లో తండ్రీ కొడుకులుగా...
ప్రభాస్, రాఘవ లారెన్స్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'రెబల్'. ఈ చిత్రంలో కృష్ణరాజు, ప్రభాస్ తండ్రి కొడుకులగా కనిపించనున్నారు. ఈ విషయాన్ని కృష్ణంరాజు కన్ఫర్మ్ చేసి చెప్పారు. ఆయన మాటల్లోనే..''రెబల్ చిత్రంలో నేను నటిస్తున్న మాట నిజం. ప్రభాస్ తండ్రిగా కనిపించబోతున్నాను. దర్శకుడు లారెన్స్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నారు అన్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం గురించి ప్రభాస్ మాట్లాడుతూ ''ప్రస్తుతం రెబల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలక సన్నివేశాల కోసం ఆగస్టులో విదేశాలకు వెళతాం అన్నారు. ఇక లారెన్స్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం ఇది.గతంలో లారెన్స్..నాగార్జున తో మాస్ వంటి హిట్ ఇచ్చారు. అలాగే ఆ తర్వాత స్టైల్ అనే చిత్రం చేసారు. నాగార్జునతో చేసిన డాన్ చిత్రం ఫెయిల్యూర్ అవటంతో ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు. తమిళంతో ముని చిత్రంలో హిట్టు కొట్టి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు. ఇక లారెన్స్ డైరక్ట్ చేస్తూ నటించిన 'కాంచన'రీసెంట్ గా రిలీజై యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











