రుద్రమదేవి: గణపతిదేవుడుగా కృష్ణం రాజు (ఫస్ట్ లుక్)
హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రుద్రమదేవి'. అల్లు అర్జున్, రానా, కృష్ణంరాజు కీలక పాత్రలు పోషించారు. గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్ త్రీడీ ద్విభాషా చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ చిత్రంలో గణపతి దేవుడుగా నటిస్తున్న కృష్ణంరాజు ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతోందీ ఈ చిత్రం. ఇందులో కృష్ణం రాజు కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి గణపతిదేవుడుగా నటిస్తున్నాడు. అనుష్క రుద్రమదేవిగా నటించిన విషయం తెలిసిందే. ఈ కథలో ప్రధాన పాత్రల్లో ఒకటైన మహామంత్రి 'శివదేవయ్య' పాత్రను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పోషించారు. ఇప్పటికే ఈ లుక్ విడుదల చేసారు.

అనుష్క, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్ ఇలా ఎంతరో ప్రముఖ స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. సినిమాపై అంచనాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రచార కార్యక్రమాలు కూడా తగ్గించారు. అయితే ఇటీవలే ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారనే వార్త బయటకు వచ్చింది. ఈ వార్త సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచింది.
గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'


Click it and Unblock the Notifications











