కృష్ణం రాజు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ నటుడు కృష్ణంరాజు పుట్టినరోజు వేడుక సోమవారం సిని ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని సవేరా ఫంక్షన్ హాల్ ఈ వేడుకకు వేదికైంది. సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, డి రామానాయుడు ఈ కార్యక్రమానికి ముక్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కృష్ణం రాజు మాట్లాడుతూ....త్వరలో సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు, ప్రభాస్‌తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తానని, అదే విధంగా ప్రభాస్‌తో భక్త కన్నప్ప చిత్రాన్ని చేస్తామని తెలిపారు. ప్రభాస్ ఆరోగ్యం గురించి రూమర్లు ప్రచారంలోకి రావడంపై స్పందిస్తూ....ఇలాంటి వార్తలు గిట్టనివారు చేస్తున్న పనే అని వెల్లడించారు. ప్రభాస్ క్షేమంగా ఉన్నాడని రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి షూటింగులో పాల్గొంటున్నాడని తెలిపారు.

కృష్ణం రాజు పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలు, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

కృష్ణం రాజు

కృష్ణం రాజు


కృష్ణం రాజు అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు. 1940న జన్మించాడు. 1970, 1980లలో తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడుగా వెలుగొందారు.

ప్రభాస్

ప్రభాస్


ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో యంగ్ రెబల్ స్టార్ గా తన హవా కొనసాగిస్తున్న ప్రభాస్‌కు కృష్ణం రాజు స్వయంగా పెదనాన్న అవుతారు.

ప్రభాస్‌తో ఒక్క అడుగు

ప్రభాస్‌తో ఒక్క అడుగు


నా దర్శకత్వంలోనే 'ఒక్క అడుగు' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాను. అవినీతి మూలాలు ఎక్కడున్నాయన్న విషయాన్ని స్పృశిస్తూ తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు నేను కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాను అన్నారు.

కమర్షియల్ ఎలిమెంట్స్‌తో

కమర్షియల్ ఎలిమెంట్స్‌తో


ఒక్క అడుగు ముందుకేస్తే వెనక లక్షల అడుగులు పడతాయని చెప్పే ఓ మంచి సందేశాత్మక చిత్రమిది. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి అంటున్నారు కృష్ణం రాజు.

ఈ ఏడాదే...

ఈ ఏడాదే...


ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు. ఓ నటుడికి జీవితంలో ఎప్పుడో కానీ రాని అవకాశం ప్రభాస్‌కు చాలా త్వరగా వచ్చింది. ఆ సినిమా కోసం ఓ నటుడు తన రెండేళ్ల కాలాన్ని వెచ్చించడం సబబే. ఆ సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి ఆ టీమ్‌కు దక్కడం ఖాయం. ప్రభాస్ ఈ ఏడాది ఆ సినిమాతో పాటు 'ఒక్క అడుగు'లోనూ నటిస్తాడు అన్నారు

బాహుబలి గురించి

బాహుబలి గురించి


ఇక అంతర్జాతీయస్థాయి చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్‌. 'బాహుబలి' కోసం చాలా కష్టపడుతున్నాడు. తనని చూసి గర్వపడుతున్నా . రాజమౌళితో ఇదివరకు 'ఛత్రపతి' చేశాడు. అది చక్కటి ఆదరణ పొందింది. మరోసారి ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' చిత్రం చేస్తుండడం ఆనందంగా ఉంది.

ప్రభాస్ పెళ్లి గురించి

ప్రభాస్ పెళ్లి గురించి


బాహుబలి సినిమా చిత్రీకరణ పూర్తవ్వగానే ప్రభాస్‌కి పెళ్లి చేయబోతున్నాం అన్నారు కృష్ణం రాజు

భక్త కన్నప్ప

భక్త కన్నప్ప


ప్రభాస్‌తో 'భక్తకన్నప్ప' సినిమా తీయాలనే ఆలోచన కూడా ఉందని కృష్ణం రాజు తెలిపారు.

ఇంకా అమ్మాయిని చూడలేదు

ఇంకా అమ్మాయిని చూడలేదు


2015లో ప్రభాస్ పెళ్లి గురించిన శుభవార్తను చెబుతాం. అయితే ఇంకా అమ్మాయిని చూడటం మొదలుపెట్టలేదు.

‘ఈశ్వరుడు-శనీశ్వరుడు'

‘ఈశ్వరుడు-శనీశ్వరుడు'


శని భగవంతుడి మంచితనాన్ని తెలుపుతూ 'ఈశ్వరుడు-శనీశ్వరుడు' అనే సీరియల్‌ను తెరకెక్కించాలనుకుంటున్నాం అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X